Durandhar VS Rajasab: దురంధర్ ను బీట్ చేయలేకపోయిన రాజాసాబ్..హిందీలో అట్టర్ ఫ్లాప్

రణవీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. దీన్ని కొత్తగా వచ్చిన సినిమాలు కూడా బీట్ చేయలేకపోతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన రాజా సాబ్ కూడా దురంధర్ ముందు తలవంచేసిందని తెలుస్తోంది. 

New Update
d vs R

రణవీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా విడుదల అయి ఇప్పటికి 38 రోజులు అయింది. అయినా కూడా ఈ మూవీ కలెక్షన్లు ఎక్కడా తగ్గడం లేదు. మరో పది రోజుల్లో ఓటీటీలో రిలీజ్ అయిపోతుందని తెలిసినా కూడా జనాలు దురంధర్ మూవీని చూడ్డానికి ఇంకా థియేటర్లకు వెళుతూనే ఉన్నారు. ప్రస్తుతం నత్తనడక నడుస్తున్న బాలీవుడ్ ను ఒక్కసారిగా పైకి లేపింది ఈ సినిమా. ఏ సినిమాకు నాని కలెక్షన్లకు రాబడుతూ థియేటర్లలో దూసుకెళిపోతోంది. 

హిందీలో రాజాసాబ్ అట్టర్ ఫ్లాప్...

ఈ సినిమా దెబ్బకు కొత్త సినిమాలు సైతం పక్కకు వెళిపోతున్నాయి. మామూలుగా తమన టాలీవుడ్ స్టార్ ప్రభాస్ కు బాలీవుడ్ లో ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువే ఉంది. ప్రభాస్ సినిమిలను హిందీ జనాలు తెగ చూస్తారు. మన తెలుగులో యావరేజ్ గా ఆడిన సినిమాలు కూడా హిందీలో మంచి సక్సెస్ ను సాధించిన దాఖలాలున్నాయి. కానీ రాజాసాబ్ విషయంలో మాత్రం అవన్నీ తారుమారు అయిపోయాయి. రణవీర్ సింగ్..ప్రభాస్ ను బీట్ చేసేశాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో రణవీర్ సింగ్ తప్పే ఇంకెవరూ కనిపించడం లేదు. దురంధర్ సినిమా ముందు ఇంకే సినిమా నిలబడడం లేదు కూడా.

రాజాసాబ్ విడుదల అయి మూడు రోజులు అయింది. దీని కలెక్షన్లు కంటే ప్రస్తుతం 38 రోజులు దాటిన దరుంధర్ సినిమా కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయి. జనవరి 9న విడుదలైన ప్రభాస్ చిత్రం 'ది రాజా సాబ్' ఇప్పటివరకు హిందీ భాషలో రూ. 15.75 కోట్ల వ్యాపారం చేసింది. హిందీ భాషలో మొదటి రోజు రూ. 6 కోట్లు, రెండవ రోజు రూ. 5.1 కోట్లు, మూడవ రోజు అంటే జనవరి 11న రూ. 4.65 కోట్లు వసూలు చేసింది. కానీ దురంధర్ సినిమా మాత్రం 38వ రోజు అయినా కూడా రూ.6.58 కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్ లెక్కలు చెబుతున్నాయి. జియో స్టూడియోస్ ఈ సినిమా వసూళ్ళను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు దురంధర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ₹1,290 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో ఈ చిత్రం 38వ రోజు ₹6.85 కోట్లు వసూలు చేసింది. 

Also Read: Union Budget 2026: ఈజీగా అప్పులు, తగ్గనున్న పన్నులతో పాటు.. ఈ కేంద్ర బడ్జెట్లో హైలైట్స్ ఇవే?

Advertisment
తాజా కథనాలు