/rtv/media/media_files/2025/05/20/arGdzCxBJRmdaaiVyKKB.jpg)
తన భర్త, నటుడు జయం రవి చేసిన ఆరోపణలను ఖండిస్తూ అతని భార్య ఆర్తి రవి మంగళవారం ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఆమె తాము విడిపోవడానికి మనీ, పవర్ కారణం కాదంది. తమ బంధంలోకి మూడోవ వ్యక్తి రావడమే తాము విడిపోవడానికి కారణమంటూ ఆర్తి సంచలన ప్రకటన చేస్తూ మూడు పేజీల లేఖను విడుదల చేసింది. మమ్మల్ని విచ్ఛిన్నం చేసింది మా మధ్య ఏదో కాదు - అది బయటి వ్యక్తి.. దీనికి నా దగ్గర ఆధారాలున్నాయి. విడాకుల పోరాటంలో ఇదే తన చివరి ప్రకటన అని ఆమె పేర్కొన్నారు. కొన్ని రోజులుగా జయం రవి, ఆర్తి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
Also Read: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
Aarti's reply is much more credible and believable than this buggers response who went with a women after leaving though he has parents, brother and friends. #AartiRavi#RaviMohan https://t.co/qO9ki67BM9 pic.twitter.com/hz0c4qUWYi
— Raj - ThalapathyFan (@lkrajkumar) May 20, 2025
Also Read: రూ.20 వేలలోపు ఇంతకన్నా మంచి ఫోన్లు చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ రా!
2009లో వివాహం
జయం రవి 2009లో ప్రముఖ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఆరవ్, అయాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2024లో విడాకులు తీసుకుంటున్నట్లుగా రవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే ఆర్తి మాత్రం తన అనుమతి లేకుండానే తన భర్త ఈ విడాకుల ఈ ప్రకటన చేశాడంటూ ఆరోపించింది. దీంతో ఇద్దరి మధ్య విడాకుల వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. ఈ క్రమంలోనే జయం రవి తన భార్య ఆమె కుటుంబంపై కీలక ఆరోపణలు చేశారు.