NTR31 : ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమాలో మరో స్టార్ హీరో..? 'కాంతార'మూవీ ఫేమ్, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ కు రిషబ్ శెట్టి అయితే బాగుంటుందని ప్రశాంత్ నీల్ భావించగా.. దీనికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. By Anil Kumar 13 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ - పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. #NTRNeel అనే వర్కింగ్ టైటిల్ తో రీసెంట్‌గానే పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ లాంఛ్ అయింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలు కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Also Read : రాశీఖన్నా కు బ్రేకప్.. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన హీరోయిన్? కీలక పాత్రలో 'కాంతారా' హీరో.. అదేంటంటే.. ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా భాగం కానున్నారట. 'కాంతార'తో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిషబ్ శెట్టికి అటు ప్రశాంత్ నీల్ ఇటు తారక్ తో మంచి బాండింగ్ ఉంది. అయితే #NTRNeel మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ కు రిషబ్ శెట్టి అయితే బాగుంటుందని ప్రశాంత్ నీల్ భావించగా.. దీనికి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. Something is Fishy 😮Rishab - NTR - NEEL antagonist - Hero - Director ?#NTRNeel 🧐 pic.twitter.com/xPOXhBDQiu — 𝐕⩜𝔯Đ卄𝐀η (@vardhanEdits) March 2, 2024 Also Read : నాగ చైతన్య కు ఉన్న ఆ అలవాటు వల్లే సమంత విడాకులు ఇచ్చిందా? రిషబ్ శెట్టి ఇప్పటికే 'జై హనుమాన్' మూవీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు. ఇక తాజాగా ఆయన 'ఎన్టీఆర్ 31' మూవీలోనూ నటించబోతున్నాడనే న్యూస్ బయటికి రావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. NTR - Neel - Rishad Shetty - Ravi Basrur Million Dollar Frame 📸 pic.twitter.com/rTEBSmm8pO — Filmy Tollywood (@FilmyTwood) August 31, 2024 Also Read : కాబోయే కోడలికి అమితాబ్ ఉత్తరం..? నిమ్రత్ కౌర్ ఎమోషనల్! మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. యూరప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన 'సప్త సాగరాలు దాటి' మూవీ ఫేమ్ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. Also Read : మెగాస్టార్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న 'పుష్ప' విలన్.. ఏ సినిమానో తెలుసా? #ntr-prasanth-neel-movie #ntr31 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి