నేను బాధ్యత కలిగిన భాగస్వామినంటూ.. రిలేషన్‌షిప్‌ను బయట పెట్టిన రష్మిక

చావా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక తన రిలేషన్‌షిప్ స్టేటస్‌ను బయట పెట్టింది. ఎప్పటికీ తాను బాధ్యత గల కుమార్తెను, సోదరిని, భాగస్వామిని అని.. జీవితంలో అన్నింటి కంటే వీటికే ఎక్కువగా విలువ ఇస్తానంది. భాగస్వామిని అనడంతో రిలేషన్‌ను బయట పెట్టినట్లు అయ్యింది.

New Update
Rashmika vijay

Rashmika vijay Photograph: (Rashmika vijay)

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, రౌడీ విజయ్ దేవరకొండ ఎప్పటి నుంచో రిలేషన్‌లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి టూర్‌కి వెళ్లడం, ఒకే లోకేషన్‌లో ఫొటోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటారు. కానీ ఇప్పటి వరకు ఇద్దరూ కూడా మంచి స్నేహితులమని చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే రష్మిక తాజాగా తన రిలేషన్ గురించి బయట పెట్టింది. బాలీవుడ్‌లో ఆమె నటించిన చావా చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌‌లో భాగంగా రష్మిక తన రిలేషన్‌ను బయట పెట్టింది. 

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela :  మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్‌ కీలక నిర్ణయం

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి విదేశయాన ప్రయత్నాలు సులభం అవుతాయి..!

వారే నాకు అన్నింటికంటే ఎక్కువ..

తనకి ఇల్లు ఎంతో ఆనందాన్ని ఇచ్చే ప్రదేశమని రష్మిక వెల్లడించింది. లైఫ్‌లో సక్సెస్, ఫెయిల్యూర్ అనేది సర్వసాధారమని.. కానీ మన ఇల్లు ఇచ్చే ఆనందం శాశ్వతం. ఎప్పటికీ కూడా తాను ఓ బాధ్యత గల కుమార్తె, సోదరిని, భాగస్వామిని అని.. జీవితంలో వీటికే ఎక్కువగా విలువ ఇస్తానని రష్మిక తెలిపింది. దీంతో ఆమె ఇన్‌డైరెక్ట్‌గా తన రిలేషన్‌షిప్ గురించి చెప్పిందని నెటిజన్లు అంటున్నారు. కుమార్తెను, సోదరి సరే కానీ.. భాగస్వామిని అనడంతో ఈమె రిలేషన్‌లో ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Big Breaking: కుంభమేళాలో తొక్కిసలాట ..17 మంది మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు