/rtv/media/media_files/2024/11/03/BrWqJtdUI87nSCBwzYN8.jpg)
Rashmika - Shravya Verma : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మరోసారి ఇంట్రెస్టింగ్ పోస్టుతో అభిమానులను అలరించింది. రష్మిక ఫ్రెండ్, టాలీవుడ్ స్టార్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మను బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల శ్రావ్య ఇచ్చిన బ్యాచిలరేట్ పార్టీలో పాల్గొన్న రష్మిక ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేసింది. ‘శ్రావ్య వర్మ మేడమ్ పెళ్లి చేసుకోబోతోంది. శ్రీకాంత్ కిదాంబి.. ఇకపై తను నీ మనిషి. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకో. ఓకే’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక రష్మిక పోస్టుపై స్పందించిన శ్రీకాంత్.. ‘మహారాణిలా చూసుకుంటా’ అంటూ మాటిచ్చాడు. అంతకుముందు ‘నా గర్ల్ గ్యాంగ్‌తో సింగిల్‌గా ఇదే నా లాస్ట్ వీకెండ్’ అంటూ శ్రావ్య షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read : హౌస్ నుంచి క్రై బేబీ అవుట్.. నాలుగు వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?
I was waaaaaiting for today.. 🐒Today is red colour so I had to put these up!
— Rashmika Mandanna (@iamRashmika) October 8, 2024
Wishing all of you a very very very happy Navratri ❤️❤️
Sending you all lots of loveeee and bigggg hugs ❤️✨ pic.twitter.com/QxcIBVPCqL
ఇది కూడా చదవండి: Umpire: బాల్ టాంపరింగ్ కు పాల్పడిన భారత కీపర్. అంపైర్ తో వాగ్వాదం!
రాంగోపాల్ వర్మ మేనకోడలు..
ఇక నాగార్జున, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్, విక్రమ్, ధ్రువ్ వంటి తారలకు ఆమె స్టైలిస్ట్‌గా పని చేసిన శావ్య.. స్టార్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మేనకోడలు కావడం విశేషం. శ్రీకాంత్‌తో శ్రావ్యకు ఎంతో కాలం నుంచి స్నేహం ఉంది. ఆగస్టు 10న వీరి నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం రష్మిక నటిస్తోన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రానికి శ్రావ్య పనిచేస్తున్నారు. కీర్తిసురేశ్ కథానాయికగా నటించిన ‘గుడ్ లఖ్ సఖి’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు.
Also Read : మహిళా డాక్టర్ కు బైకర్ వేధింపులు.. శృంగార వీడియోలు పంపిస్తూ!
ఇది కూడా చదవండి: Iran: రేపే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు