AP: గుర్తు లేదు..నాకేం తెలియదు..ముగిసిన పోసాని విచారణ

అన్నమయ్య జిల్లాలోని ఓబులవారి పల్లెలోని పీఎస్ లో పోసాని కృష్ణ మురళి విచారణ ముగిసింది. ఇందులో పోసాని కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. పవన్ పై తాను వ్యక్తిగత దూషణలు చేయలేదని పోసాని అన్నారు.

author-image
By Manogna alamuru
New Update

వైసీపీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళిపై పోలీసుల విచారణ ముగిసింది.  ఓబులవారి పల్లెలో పీఎస్ లో ఎస్సీ పోసానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందులో ఆయన కీలక విషయాలు చెప్పారని పోలీసులు చెబుతున్నారు. పవన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానంగా పోసాని.. తనది..వ్యక్తిగత దూషణలు చేసే మనస్తత్వం తనది కాదని చెప్పినట్టు తెలుస్తోంది. పవన్‌తో మీటింగ్ ఏర్పాటు చేస్తే తాను సమాధానం చెబుతానని చెప్పారని పోలీసులు చెబుతున్నారు. గతంలో పవన్, జనసేన నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాను మాత్రమే స్పందించానని పోసాని చెప్పారని పోలీసులు తెలిపారు. నేను కౌంటర్లే ఇచ్చాను.. దానికే కట్టుబడి ఉన్నానని పోసాని అన్నారు.  

తెలీదు...గుర్తులేదు..

తానొక స్క్రిప్ట్ రైటర్‌నని.. ఏం మాట్లాడాలో, వద్దో నాకు తెలుసని పోసాని నమ్మకంగా చెబుతున్నారు. ఒకరు చెబితే మాట్లాడే వాడిని కాదని తనకంటూ స్వంత వ్యక్తిత్వం ఉందని ఆయన చెప్పారు. అయితే తాము అడిగిన చాలా ప్రశ్నలకు పోసాని సమాధానం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఏ ప్రశ్న అడిగినా.. తెలియదు, గుర్తులేదు, అవునా? అంటూ సమాధానాలు దాటవేశారని . మీడియా సమావేశాల్లో మాట్లాడిన వీడియోలు ముందు పెట్టి ప్రశ్నించినా.. ‘లవ్ యు రాజా’ అంటూ తనదైన శైలిలో పోసాని ప్రవర్తించినట్టు తెలుస్తోంది. విచారణ తర్వాత పోసానిని రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందు హజరుపర్చారు. ఓబులవారిపల్లె పీఎస్‌లోనే  పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు ధ్రువీకరించారు.

Also Read: Ravi Praksh: TV9 లోగో వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

Advertisment
తాజా కథనాలు