నన్ను అరెస్ట్ చేస్తే జైలుకెళ్లి ఆ పని చేస్తా.. RGV సంచలన కామెంట్స్

ఏపీలో తనపై నమోదైన కేసుల విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంపై RGV అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. నేను హైదరాబాద్‌లో ఉన్నా. ఇంటర్వ్యూలు ఇస్తున్నా. నన్ను అరెస్టు చేస్తే జైలుకెళ్తా.. నాలుగు సినిమా కథలు రాసుకుంటానని అన్నారు.

New Update
rgv01

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ టైంలో వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై ఆర్జీవీపై ఏపీలో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంపై అసహనం వ్యక్తం చేసిన RGV.. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అరెస్టు చేస్తే జైలుకెళ్తా..

" సోషల్‌మీడియాను రెగ్యులరైజ్‌ చేయడం కష్టం. చట్టంలో నాకున్న అవకాశాలను బట్టి పోలీసులకు సమాధానమిచ్చా. నేను హైదరాబాద్‌లో ఉన్నాను. లైవ్‌లో ఇంటర్వ్యూలు ఇస్తున్నా. పోలీసులు ఇంకా నన్ను పట్టుకోలేదని చాలా మంది అంటున్నారు. నన్ను అరెస్టు చేస్తే జైలుకెళ్తా.. నాలుగు సినిమా కథలు రాసుకుంటా. గత కొన్నేళ్లుగా నా ఎక్స్ అకౌంట్‌లో వేల పోస్టులు పెట్టాను. వాటిలో కొన్నింటి వల్ల నలుగురి మనోభావాలు దెబ్బతిన్నాయని ఏడాది తర్వాత స్పందించడం ఏంటని? ప్రశ్నించారు.

Also Read : ఫిల్మ్‌ఫేర్‌ ఓటీటీ అవార్డ్స్..మెగా హీరో షార్ట్ ఫిలింకి అరుదైన పురస్కారం

సోషల్ మీడియాలో అతి చేయొద్దని అంటున్నారు. అది మీరెలా చెబుతారు. ఒక కార్టూన్ పోస్టును అనే రకాల కోణల్లో ఆపాదించుకోవచ్చు. నన్ను కోట్‌ చేస్తూ ప్రధాన మీడియా సంస్థలు పోస్టులు కూడా పెడుతున్నాయి. నేను హైదరాబాద్‌లోనే ఉన్నానని చెబుతున్నా, ‘పరారీలో ఉన్నాడు’ అంటారు. కాశ్‌రాజ్, నాగార్జున నన్ను దాచిపెట్టారని మీడియా ప్రచారం చేసింది. పోలీసుల కంటే మీడియానే డిటెక్టివ్‌గా మారింది.." అంటూ మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

ఇది కూడా చదవండి: విద్యా, వైద్యంపై స్పెషల్ ఫోకస్.. దేశ చరిత్రలోనే తెలంగాణ రికార్డ్

Also Read:  కాంగ్రెస్ లోకి హరీష్‌ రావు.. మాజీ సీఎంతో మంతనాలు!

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు