బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

'పుష్ప2' హిందీ వెర్షన్ ప్రీ సేల్స్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 24 గంటల్లో లక్ష టికెట్స్‌ సేల్‌ అయ్యాయి. దీంతో బాలీవుడ్‌లో రికార్డులు సృష్టించిన స్త్రీ2(41k), డంకీ (42k), యానిమల్‌ (52.5k), టైగర్‌3 (65k) సినిమాలను ‘పుష్ప2’ అధిగమించింది.

New Update
allu arjun2

దేశ వ్యాప్తంగా 'పుష్ప' ఫీవర్ నడుస్తోంది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప2' కోసం మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 5 న ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 

24 గంటల్లోనే లక్ష టికెట్లు..

ముఖ్యంగా నార్త్ లో రికార్డు స్థాయిలో టికెట్స్ అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప2' హిందీ వెర్షన్ ప్రీ సేల్స్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 24 గంటల్లో లక్ష టికెట్స్‌ సేల్‌ అయ్యాయి. దీంతో బాలీవుడ్‌లో రికార్డులు సృష్టించిన స్త్రీ2(41k), డంకీ (42k), యానిమల్‌ (52.5k), టైగర్‌3 (65k) సినిమాలను ‘పుష్ప2’ అధిగమించింది. 

Also Read: Aviation : 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!

బాలీవుడ్‌లో ఆల్‌ టైమ్‌ టాప్ చిత్రాల లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచింది.  ప్రీసేల్‌ బుకింగ్స్‌లోనే ఈ చిత్రం ఇప్పటివరకు రూ.60కోట్లకు పైగా వసూలుచేసినట్లు ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఇదే ఊపు కంటిన్యూ అయితే కేవలం హిందీలోనే ఈ సినిమా 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు