ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్స్..మెగా హీరో షార్ట్ ఫిలింకి అరుదైన పురస్కారం ఫిలిం ఫేర్ ఓటీటీ అవార్డ్స్ ముంబై వేదికగా గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించి అవార్డులను ప్రకటించారు. సినిమా విభాగంలో ఉత్తమ నటిగా కరీనా కపూర్, ఉత్తమ నటుడిగా దిల్జిత్ దొసాంజ్ అవార్డు సొంతం చేసుకున్నారు. By Anil Kumar 02 Dec 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Filmfare OTT Awards 2024 : ఫిలిం ఫేర్ ఓటీటీ అవార్డ్స్ ఈవెంట్ నిన్న రాత్రి గ్రాండ్ గా జరిగింది. ముంబై వేదికగా జరిగిన ఈ వేడుకలో టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు పలువురు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించి అవార్డులను ప్రకటించారు. ఇందులో సినిమా విభాగంలో ఉత్తమ నటిగా కరీనా కపూర్, ఉత్తమ నటుడిగా దిల్జిత్ దొసాంజ్ అవార్డు సొంతం చేసుకున్నారు. కాగా ఈ వేడుకలోనే మన తెలుగు నుంచి మెగా హీరో సాయిదుర్గా తేజ్, స్వాతి నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’.. పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు దక్కించుకుంది. Also Read : 'పుష్ప2' ప్రీ రిలీజ్ చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్.. నాగబాబు పోస్ట్ వైరల్ View this post on Instagram A post shared by Sai DURGHA Tej (@jetpanja) ఓటీటీ సినిమాలకు సంబంధించిన విజేతల లిస్ట్ ఇదే.. ఉత్తమ చిత్రం: అమర్‌సింగ్ చంకీల ఉత్తమ నటుడు: దిల్జిత్ (అమర్‌సింగ్ చంకీల) ఉత్తమ నటి: కరీనా కపూర్ (జానే జాన్) ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్ అలీ (అమర్‌సింగ్ చంకీల) ఉత్తమ నూతన దర్శకుడు: అర్జున్ వరైన్ సింగ్ (కహో గయే హమ్ కహాన్) త్తమ నూతన నటుడు: వేదాంగ్ రైనా ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): జానే జాన్ ఉత్తమ నటుడు (క్రిటిక్స్): జైదీప్ అహ్లావత్ ఉత్తమ నటి (క్రిటిక్స్): అనన్య పాండే Also Read: తెరపైకి మోహన్‌బాబు మనవరాళ్లు.. 'కన్నప్ప' పోస్టర్ వైరల్ వెబ్ సిరీస్‌లకు సంబంధించిన విజేతలు వీళ్ళే.. ఉత్తమ సిరీస్: ది రైల్వే మెన్ ఉత్తమ నటుడు (డ్రామా): గగన్ దేవ్ రియార్ (స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ) ఉత్తమ నటి (డ్రామా): మనీషా కొయిరాలా (హీరామండి: ది డైమంఢ్ బజార్) ఉత్తమ నటుడు (కామెడీ): రాజ్‌కుమార్ రావు (గన్స్ అండ్ గులాబ్స్) ఉత్తమ దర్శకుడు: సమీర్ సక్సెనా, అమిత్ గోలానీ (కాలా పాని) ఉత్తమ కామెడీ: మామ్లా లీగల్ హై ఉత్తమ ఎడిటింగ్: యషా జైదేవ్ రాంచందానీ (ది రైల్వే మెన్) ఉత్తమ వీఎఫ్‌ఎక్స్: ఫిల్మ్‌గేట్ ఏబీ, హైవే స్టూడియోస్ (ది రైల్వే మెన్) ఉత్తమ నూతన దర్శకుడు: శివ రావైల్ (ది రైల్వే మెన్) Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్ Also Read: Aviation : 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు! #sai-durga-tej #diljit dosanjh #filmfare ott awards #ott మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి