Ram Charan: రామ్ చరణ్ 256 అడుగుల భారీ కటౌట్.. మాములుగా లేదు, మీరు చూశారా?

రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా సక్సెస్ కావాలని కోరుతూ ఆయన అభిమానులు 256 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయాలనే ఉద్దేశంతో రాంచరణ్ యువశక్తి ఆధ్వర్యంలో నిర్మించారు.

New Update
ram charan cutout

ram charan cutout

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా సక్సెస్ కావాలని కోరుతూ ఆయన అభిమానులు ఒక అరుదైన కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దేశంలో ఇంతకుముందు ఎక్కడా చూడనటువంటి విధంగా, విజయవాడ వజ్ర గ్రౌండ్‌లో  ఏకంగా 256 అడుగుల ఎత్తుతో రామ్ చరణ్ భారీ కటౌట్‌ను నెలకొల్పారు. 

 రామ్ చరణ్‌కు గిఫ్ట్ గా..

ఈ కటౌట్‌ను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయాలనే ఉద్దేశంతో రాంచరణ్ యువశక్తి ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ భారీ కటౌట్ నిర్మాణం కోసం చెన్నై నుండి ప్రత్యేక సహకారం తీసుకుని, దాదాపు పది రోజుల పాటు కష్టపడి పని చేసినట్లు అభిమానులు తెలిపారు. రామ్ చరణ్‌కు గిఫ్ట్ గా ఈ కటౌట్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. 

Also Read : యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్

Also Read:ఈ ఏడాది రిలీజ్ అయిన టాప్ ప్రీమియం బైక్స్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్!

వజ్ర గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం జరగనున్న 'గేమ్ ఛేంజర్' ప్రత్యేక వేడుక జరగనుందని, ఈ సందర్భంగా చిత్ర బృందంతో పాటు దర్శకుడు, నిర్మాతలు మరియు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నట్లు అభిమానులు తెలిపారు. 

Also Read: 'పుష్ప2' ర్యాంపేజ్.. ఒక్కరోజులోనే పెరిగిన కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?

పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ, అంజలి నటిస్తుండగా.. ఎస్.జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, ప్రియదర్శి ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read : పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు