గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" భారీ అంచనాలతో తెరకెక్కింది. ఈ చిత్రం పట్టాలెక్కిన 3ఏళ్ల తర్వాత నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ చేసిన మొదటి సినిమా ఇదే కావడంతో ఒకవైపు మెగా ఫ్యాన్స్, మరోవైపు సినీ అభిమానుల్లోనూ ఊహకందని అంచనాలు ఉన్నాయి. అందులోనూ స్టార్ అండ్ క్రియేటివ్ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందడంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. Also Read: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా అంచనాలు తలకిందులు కానీ ఇవాళ థియేటర్లలో బొమ్మ పడిన తర్వాత అందరి అంచనాలు తలకిందులయ్యాయి. శంకర్ ఏంటి సినిమాను ఇలా తీశాడు అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అనుకున్నది ఒకటి.. అయినది ఒకటి అంటూ దర్శకుడు శంకర్‌పై మండిపడుతున్నారు. సినిమా అంతా ఔట్‌డేటెడ్ స్టోరీ అంటూ చెప్పుకొస్తున్నారు. ఎక్కడా శంకర్ మార్క్ కనిపించలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. Also Read: తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా వన్ మ్యాన్ షో సినిమా మొత్తంలో రామ్ చరణ్ యాక్టింగ్ చాలా నచ్చిందంటూ చెబుతున్నారు. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నారు. అలాగే ఏపీ రాజకీయాలకు సంబంధించినట్లుగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని కొందరు చెప్పుకొస్తున్నారు. ఈ సినిమా కోసమేనా 3 ఏళ్లు వెయిట్ చేయించిందంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చరణ్ ఒక మంచి హిట్ కొడతాడు అనుకుంటే ఇలా అయిందేంటి అని అభిమానులు నిరాశ చెందుతున్నారు. Also Read: మహా కుంభమేళాకు రానున్న స్టీవ్‌జాబ్స్ భార్య ఓటీటీలోకి ఎప్పుడంటే? ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీపై తాజాగా ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాదాపు రూ. 450 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పార్మ్ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ ఓటీటీ హక్కులను భారీ ధరకే దక్కించుకున్నట్లు సమాచారం. దాదాపు రూ.105 కోట్లకు పైగా కొనుక్కున్నట్లు తెలుస్తోంది. దీంతో 6 వారాల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేశాయి. Also Read: నేనూ మనిషినే తప్పులు చేస్తాను దేవుడిని కాదు–ప్రధాని మోదీ