War2 Pre Release Event: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన జూనియర్ 'వార్ 2' గురించే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా అంతా నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లతో నిండిపోయింది. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండడంతో... వేల సంఖ్యల్లో ఫ్యాన్స్ తరలివచ్చారు. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకే వేదికపై కలిసి కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు ! జూనియర్ అభిమానులు, హృతిక్ అభిమానులు కలిసి ఒక పండగ వాతావరణాన్ని సృష్టించారు. ఫ్యాన్స్ నినాదాలు, కేకలతో స్టేడియం అంతా దద్దరిల్లిపోయింది.
ఈసారి బొమ్మ అదిరింది!
ఈ ఈవెంట్ నుంచి వచ్చిన ప్రతి చిన్న వీడియో, ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్- హృతిక్ ఇద్దరు కలిసి స్టేజ్ పై 'షర్ట్ కాలరెత్తిన' వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ప్రతిసారి ఒకటే ఎత్తేవాడిని.. ఈసారి రెండు ఎత్తుతున్నాను అంటూ షర్ట్ కాలరెత్తాడు! ఏం పర్లేదు.. ఎవరు ఏం మాట్లాడిన.. ఏం అనుకున్నా ఈ సారి బొమ్మ అదిరిపోయింది! పండగ చేస్కోండి అంటూ సినిమా పై ధీమా వ్యక్తం చేశారు. దీంతో స్టేడియం అంతా అరుపులతో మారుమోగిపోయింది. మొత్తానికి వార్ 2' ప్రీ-రిలీజ్ ఈవెంట్ సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ఉన్న స్నేహం, వారి మాటలు, అభిమానుల హంగామా ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈవెంట్‌లో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారని అభిమానులు ఎదురుచూశారు. కానీ అది జరగలేదు.
INTERNET FILLED WITH THIS VIDEO ALREADY 💣💥💥🧨🧨 @tarak9999@iHrithik#War2PreReleaseEvent#WAR2
— Let's X OTT GLOBAL (@LetsXOtt) August 10, 2025
pic.twitter.com/mWAo7sfMsX
బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ ట్రైలర్ విడుదలవగా.. ఎన్టీఆర్- హృతిక్ మధ్య యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాయి. అలాగే 'సలాం అనాలి' పాటలో తారక్, హృతిక్ డాన్స్ తో అదరగొట్టారు. థియేటర్లో ఈ పాటను చూసేందుకు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు సినీ ప్రియులు. 'వార్ 2' తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
ఇదిలా ఉంటే 'వార్2' లో కియారా బికినీ లుక్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో కియారా బికినీ సీక్వెన్స్ లకు సెన్సార్ బోర్డు నో చెప్పింది. 9 సెకన్ల బికినీ సీన్ ని తొలగించాలని ఆదేశించింది. అలాగే బికినీలో కనిపించే పూల్ సీన్‌ను కొంత మేర తగ్గించాల్సిందిగా సూచించింది. కియారా తన పాత్ర కోసం చాలా కష్టపడింది. ఆ ఫిట్ నెస్ కోసం ప్రత్యేకమైన డైట్, వ్యాయామాలు చేసింది.