Rajinikanth: రోడ్డు పక్కన నిల్చొని సూపర్ స్టార్ భోజనం.. వైరలవుతున్న  ఫొటోలు!

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ రోడ్డుపక్కన ఆకు విస్తరిలో భోజనం చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో సూపర్ స్టార్ తో పాటు అతడి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.

New Update
Superstar Rajinikanth

Superstar Rajinikanth

Rajinikanth: సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ రోడ్డుపక్కన ఆకు విస్తరిలో భోజనం చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో సూపర్ స్టార్ తో పాటు ఆయన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇందులో రజినీకాంత్(Rajinikanth) తెలుపు రంగు చొక్కా, పంచె ధరించి ఎంతో సింపుల్ గా కనిపించారు. ఇవి చూసిన నెటిజన్లు, తలైవా అభిమానులు ఆయన సింప్లిసిటీకీ ఫిదా అవుతున్నారు. అసలు ఈ ఫొటోలు ఎక్కడ తీసుకున్నారు? దీని వెనుక స్టోరీ ఏంటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకోండి.. 

Also Read :  అల్లు అర్జున్ కు మాస్ వార్నింగ్ ఇచ్చిన ACP మృతి.. పోలీస్ శాఖలో విషాదం!

ఆధ్యాత్మిక పర్యటన 

సినిమాల నుంచి కొంత బ్రేక్ తీసుకున్న రజినీకాంత్ తన ఫ్రెండ్స్, సన్నిహితులతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా రిషికేష్(rishikesh) వెళ్లారు. రిషికేష్ లోని స్వామి దయానంద్ ఆశ్రమాన్ని సందర్శించుకున్నారు. అక్కడ గంగా హారతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ పర్యటనలో రజనీకాంత్ రోడ్డు పక్కన ఆగి, ఒక సాధారణ వ్యక్తి మాదిరిగా  పత్తాల్ (ఆకుల పళ్ళెం) లో  భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది.  ఎటువంటి ఆడంబరం లేకుండా, కారు పక్కనే ఒక రాయిపై కూర్చుని ఆయన భోజనం చేయడం ఆయన సింప్లిసిటీనీ తెలియజేస్తోంది. రజినీకాంత్ సాధారణ వ్యక్తిత్వం, వినయం పై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రిషికేశ్ తర్వాత, రజినీకాంత్  ద్వారహట్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read :  'మాస్ జాతర' నుంచి ఊపేస్తున్న మరో పాట.. శ్రీలీల- రవితేజ రొమాన్స్!

Advertisment
తాజా కథనాలు