Mass Jathara: రవితేజ- శ్రీలీల జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర మరో పాట విడుదల చేశారు మేకర్స్. హుడియో.. హుడియో అంటూ రొమాంటిక్ బీట్స్ తో సాగిన ఈ పాట ప్రేక్షకులను అలరించింది. ఇందులో లంగావోనీలో శ్రీలీల విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ పాటకు భీమ్స్ మ్యూజిక్ అందించడంతో పాటు పాట కూడా పాడారు. హేషమ్ అబ్దుల్ వహాబ్, భీమ్స్ సిసిరోలియో వాయిస్ అదిరిపోయింది. దేవ్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. భాను బోగవరపు దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇప్పటికే మూవీ షూటింగ్ పనులు పూర్తవగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే సినిమా నుంచి వరుస అప్డేట్లు వదులుతూ హైప్ పెంచుతున్నారు మేకర్స్.
#HudiyoHudiyo promo out now!
— Ravi Teja (@RaviTeja_offl) October 6, 2025
Full lyrical on October 8th ❤️#MassJathara#MassJatharaOnOct31stpic.twitter.com/4E614A3Yo9
Also Read: Shoaib Malik Sana Javed Divorce: సానియా మాజీ భర్త మాలిక్ మూడో భార్యకు విడాకులు