Rajinikanth Coolie: 'కూలీ' స్టోరీ లీక్.. నాగ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అంతే!

'కూలీ' స్టోరీ లీక్.. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో నాగార్జున పాత్ర ‘కింగ్ మేకర్’గా ఉండబోతుందని సమాచారం. రజినీకాంత్, నాగ్ మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటాయని అయితే, నాగ్ పాత్ర కేవలం ఫ్లాష్‌బ్యాక్ లో మాత్రమే ఉండనుందని సమాచారం.

New Update
Rajinikanth Coolie

Rajinikanth Coolie

Rajinikanth Coolie: కోలీవుడ్‌ దర్శకుడు లోకేశ్ కనకరాజ్(Lokesh Kanagaraj) తన ప్రతీ ప్రాజెక్ట్‌తో తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో విజయాలతో పాటు ప్రేక్షకుల్లో విశ్వాసాన్ని సంపాదించారు. లోకేశ్ సినిమా అంటే మినిమం హిట్ గ్యారంటీ అనిపించేలా పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం, ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ గురించి ఒక ఆసక్తికరమైన రూమర్ బయటికొచ్చింది. ఈ సినిమా లో నాగార్జున(Nagarjuna) పాత్ర ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

Also Read :  సుజాత లేని గేమ్ ఛేంజర్.. ఎవరీ రంగరాజన్ .. శంకర్ పని అయిపోయనట్టేనా!

‘కూలీ’ సినిమా భారీ క్యాస్టింగ్‌తో వస్తున్న ప్రాజెక్ట్, ఇందులో తలైవా రజినీకాంత్ మెయిన్ హీరో కాగా, ప్రముఖ తెలుగు హీరో నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర(Upendra) ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ముగ్గురు సూపర్ స్టార్‌లతో కూడిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, నాగార్జున పాత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన సీన్ లీక్ అయింది. షూటింగ్ సమయంలో లీకైన ఈ వీడియోలో సీన్ చాలా కీలకమని లోకేశ్ కనకరాజ్ వెల్లడించారు. నాగార్జున పాత్ర పై ప్రస్తుతం హాట్ టాపిక్‌గా చర్చ జరుగుతుంది.

Aslo Read :  Liquor rates: ఏపీలో మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. మద్యం ధరలు తగ్గాయోచ్‌!

నాగ్ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్..

మేకర్స్ ‘కూలీ’ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే వెల్లడించారు. అయితే, నాగార్జున పాత్ర ‘కింగ్ మేకర్’గా ఉండబోతుందని సమాచారం. రజినీకాంత్, నాగార్జున మధ్య వచ్చే సీన్స్ ఈ సినిమాకి హైలెట్ గా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపారు. కానీ, నాగార్జున పాత్ర  ఫ్లాష్‌బ్యాక్ లో మాత్రమే ఉండనుందని సమాచారం. రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర లాంటి బడా హీరోలు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించడం గూస్‌బంప్స్ మూమెంట్ అనే చెప్పాలి. 

Also Read :  కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో విచారణకు హోంశాఖ గ్రీన్ సిగ్నల్

‘కూలీ’ సినిమా స్టార్ క్యాస్టింగ్ వల్ల అంచనాలు మరింత పెరిగాయి. శృతి హాసన్(Sruthi Hassan) కూడా లీడ్ రోల్‌లో కనిపించనుంది. ఆమె పాత్ర కథకు కీలకమైన మలుపు తెచ్చేలా ఉంటుందని తెలుస్తోంది. మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, తమిళ నటుడు సత్యరాజ్(Sathya Raj) కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. సినిమా త్వరలోనే, మే లేదా ఆగస్ట్ నాటికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

#coolie-movie #Lokesh Kanagaraj #nagarjuna #telugu-film-news #rajinikanth-coolie-movie #rajini-kanth #rtv telugu news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు