/rtv/media/media_files/2025/03/05/VDrS1EmT84Ictwq4KQDz.jpg)
Mahesh Babu went to Odisha state for SSMB29 movie shooting Photograph: (Mahesh Babu went to Odisha state for SSMB29 movie shooting)
SSMB29: దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న #SSMB29 షూటింగ్ వీడియో లీక్ అయింది. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం బెంగళూరు అడవుల్లో జరుగుతోంది. అయితే ఈ మూవీలోని ఓ సన్నివేశాన్ని ఫోన్‌లో రికార్డ్ చేసి గుర్తుతెలియని వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది వైరల్ గా మారింది.
మెకాళ్లపై కూర్చొని..
ఇదులో మహేష్ బాబు నడుచుకుంటూ వెళ్తుంటే.. విలన్లు అతన్ని కొట్టడం, మహేష్ మోకాళ్లపై కూర్చోవడం వంటివి కనిపించాయి. అంతేకాదు ఈ వీడియోలో కన్నడ హీరో పృథ్వీరాజ్ దర్శనమిచ్చారు. అతను ఓ వీల్ చైర్‌లో కూర్చొని కనిపించగా సీన్ లీక్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Also Read: కన్నడ హీరోయిన్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు.. ఏడాదికి 27 దుబాయ్ ట్రిప్స్
ఇదిలా ఉంటే.. ఈ మూవీలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. మెయిన్ హీరోయిన్‌గా ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లెన్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చెల్సియా ఇస్లెన్‌కి స్క్రీన్ టెస్ట్ కూడా చేశారని, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం ఈ సినిమాకు సంబంధించి రీ రికార్డింగ్ పనులు మొదలుపెట్టారని విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
Also Read: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..!