Baahubali: The Epic: 'బాహుబలి' బడ్జెట్‌ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ

‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో వస్తున్న స్పెషల్ ఎడిషన్‌ అక్టోబర్ 31, 2025న థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నారు. అప్పట్లో 80% బడ్జెట్‌ను నిర్మాణంపై ఖర్చు చేసి 20% బడ్జెట్ మాత్రమే నటి నటులకి చెల్లించామని నిర్మాత శోభు యార్లగడ్డ ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు.

New Update
Baahubali: The Epic

Baahubali: The Epic

Baahubali: The Epic: ఇండియన్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన గ్రాండ్ విజువల్ వండర్ ‘బాహుబలి’ గురించి తాజా అప్‌డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ(Shobhu Yarlagadda) తాజాగా ఆసక్తికర విషయాన్ని షేర్ చేశారు. బాహుబలి సినిమా బడ్జెట్‌లో 80% నిర్మాణ ఖర్చులకు, కేవలం 20% మాత్రమే నటులు, టెక్నిషియన్ల రెమ్యూనరేషన్‌కు వెచ్చించామన్నారు. సినిమా గ్రాండ్ క్వాలిటీ, భారీ స్థాయిలో తెరకెక్కించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!

ఇప్పుడు ఈ పాన్-ఇండియా హిట్‌ను మళ్లీ థియేటర్లలో చూపించేందుకు దర్శకుడు రాజమౌళి ఓ ప్రత్యేక ప్లాన్‌తో ముందుకొస్తున్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్’ (2015), ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ (2017) రెండు భాగాలను కలిపి, ఒకే ఫార్మాట్‌లో “బాహుబలి: ది ఎపిక్” పేరుతో అక్టోబర్ 31, 2025న గ్రాండ్ రీ-రిలీజ్ చేయబోతున్నారు.

Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!

బాహుబలి 3 వస్తుందా?

ఈ స్పెషల్ ఎడిషన్‌కి సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. టీజర్ చూసిన ప్రేక్షకుల్లో, ఇందులో కొత్త సీన్లు ఉన్నాయా? క్లైమాక్స్‌లో ఏమైనా మార్పు ఉందా? అనే ఆసక్తి ఏర్పడింది. అంతేకాదు, బాహుబలి 3 వస్తుందా? అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

దీనిపై స్పందించిన శోభు యార్లగడ్డ, “ఇవి పుకార్లే. బాహుబలి 3పై ఇంకా చాలా పని చేయాలి. కానీ ఈ ఎడిషన్‌లో ఓ చిన్న సర్ప్రైజ్ ఉండొచ్చు,” అని చెప్పారు. ఈ మాటలు విన్న ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు.

Also Read: పవన్ సినిమాలో విలన్‌గా మల్లా రెడ్డి.. ట్విస్ట్ ఏంటంటే..?

ఈ స్పెషల్ ఎడిషన్‌కి ముఖ్య కారణం కేవలం కలెక్షన్లు కాదని, ఇది ఒక సెలబ్రేషన్ అని నిర్మాత తెలిపారు. బాహుబలి సినిమా విడుదలై దాదాపు 10 ఏళ్లు కావడంతో, మళ్లీ పెద్ద స్క్రీన్‌పై చూడాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్లాన్ చేశారంటూ వెల్లడించారు.

ఇప్పటివరకు ఈ కొత్త ఎడిషన్‌కి రన్‌టైమ్ గురించి క్లారిటీ రాలేదు. అయితే, రెండు పార్టుల నుంచి ముఖ్యమైన సీన్లను మాత్రమే తీసుకుని కొత్త కట్‌గా రూపొందించినట్టు సమాచారం. రాజమౌళి ఏ సీన్లు ఉంచారో, ఏవి తీసేశారో ఆయనకే తెలుసంటూ రానా దగ్గుబాటి స్పందించారు.

Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..

ఈ రీ-రిలీజ్ కోసం ప్రత్యేక ప్రమోషనల్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి తదితరులు పాల్గొనబోతున్నట్టు సమాచారం.

మొత్తానికి, బాహుబలి మళ్లీ థియేటర్‌లో సందడి చేయబోతుంది. ఈసారి కొత్త లుక్‌లో, కొత్త అనుభూతితో ప్రేక్షకులను మంత్రముగ్ధం చేయబోతుందా? బాహుబలి 3పై క్లారిటీ వస్తుందా? అనే కుతూహలం అందరిలోనూ ఉంది.

Advertisment
తాజా కథనాలు