Raviteja Mass Jathara: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..

రవి తేజ నటిస్తున్న ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇందులోని ‘ఓలే ఓలే’ పాటపై విమర్శలు రావడంతో, దర్శకుడు భాను, శ్రీలీల, రవి తేజ వివరణ ఇచ్చారు. పాటలోని పదాలు సన్నివేశానికి తగ్గవని, సినిమా చూసిన తర్వాత అసలు అర్థం తెలుస్తుందని తెలిపారు.

New Update
Raviteja Mass Jathara

Raviteja Mass Jathara

Raviteja Mass Jathara: మాస్ మహారాజా రవి తేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’ థియేటర్లలో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2025 అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది.

అయితే మొదట ఆగస్ట్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యమవడం, ఇండస్ట్రీలో జరిగిన ఫెడరేషన్ స్ట్రైక్ వంటి కారణాల వల్ల చిత్రం పోస్ట్‌పోన్ అయింది. ఇప్పుడు కొత్త విడుదల తేదీతో మళ్లీ బజ్‌ను పెంచుతోంది మూవీ టీమ్.

Also Read: పవన్ సినిమాలో విలన్‌గా మల్లా రెడ్డి.. ట్విస్ట్ ఏంటంటే..?

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (నాగవంశీ), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ (సాయి సౌజన్య) కలిసి నిర్మిస్తున్నారు. శ్రికర స్టూడియోస్ ప్రెజెంట్ చేస్తోంది. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.

Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!

‘ఓలే ఓలే’ పాటపై వివాదం (Ole Ole Song Controversy)

ఈ చిత్రంలోని ఓ మాస్ సాంగ్ ‘ఓలే ఓలే’ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. కొన్ని వర్గాలు ఈ పాటలోని పదాలు అభ్యంతరకరంగా, మర్యాదలకు విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా ప్రముఖ యాంకర్ సుమ నిర్వహించిన ఇంటర్వ్యూలో చిత్ర బృందం దీనిపై స్పందించింది.

Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!

దర్శకుడు భాను భోగవరపు మాట్లాడుతూ, "ఇతర సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఉంటే స్వాగతిస్తారు. కానీ మా సినిమా పాటపై మాత్రమే విమర్శలు వస్తున్నాయి. గ్రామాల్లో జాతరల సమయంలో కొందరు చిన్న చిన్న కథలు చెబుతారు. అవి వినడానికి అసభ్యంగా అనిపించినా, వాస్తవానికి అవి సంప్రదాయాల్లో భాగం" అన్నారు. శ్రీలీల మాట్లాడుతూ, "ఆ పాటలోని పదాలు, సన్నివేశానికి అర్థవంతంగా ఉన్నాయి. కథకు అవసరమైన విధంగా సాగుతుంది" అని స్పష్టం చేశారు.

Also Read: పాముల భయంతో బ్లాక్ బస్టర్ సినిమా మిస్ చేసుకున్న హీరో!

రవి తేజ మాట్లాడుతూ, "ప్రస్తుతం పాటలోని మొదటి లైన్లపై మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. కానీ తర్వాత భాగంలో ఫన్ కూడా ఉంది. సినిమా చూసిన తర్వాతే ఆ పాట ఉద్దేశం అందరికీ క్లియర్ అవుతుంది. ఇంగ్లీష్‌లో అసభ్య పదాలు సాధారణంగా వాడతారు. అవే తెలుగులో ఉంటే ఎందుకు ఇబ్బంది?" అని ప్రశ్నించారు.

రవి తేజ మాస్ ఫెస్టివల్

ఈ సినిమాలో రవి తేజ పూర్తిగా మాస్ గెటప్‌లో కనిపించనున్నారు. యాక్షన్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ కలిపిన సినిమా కావడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. పాటలు, ట్రైలర్ విడుదలైతే హైప్ మరింత పెరిగే అవకాశముంది.

Advertisment
తాజా కథనాలు