Samantha: నమ్మకం చాలా విలువైందంటూ డైరెక్టర్ భార్య ఇన్‌డైరెక్ట్ కౌంటర్.. సమంత, రాజ్ రిలేషన్ గురించేనా?

"నమ్మకం అనేది అన్నిటికంటే చాలా విలువైనది. ఒకసారి దాన్ని కోల్పోతే మళ్లీ ఎన్ని ఆస్తులు పెట్టినా కూడా తిరిగి పొందలేరు" అని రాజ్ నిడిమోరు భార్య పోస్ట్ పెట్టారు. సమంత, రాజ్ డేటింగ్ విషయంలో వస్తున్న పుకార్ల నేపథ్యంలో పోస్ట్ పెట్టడంతో కాస్త వైరల్ అవుతోంది.

New Update
Viral Post

Viral Post

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు, హీరోయిన్ సమంత ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి తగ్గట్లు వారు జోరుగా తిరగడం, రాజ్ నిడిమోరు భార్య చేసిన పోస్టులు వీరి రిలేషన్‌కు ఆధ్యం పోస్తున్నాయి. అయితే గత కొంత కాలం నుంచి ఆయన భార్య శ్యామలి నిడిమోరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా మరోసారి ఆమె నమ్మకం గురించి ఓ పోస్ట్ పెట్టారు. 

ఇది కూడా చూడండి:IND vs ENG : వాళ్లు లేకుండా ఆడటం కష్టమే.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్!

ఇది కూడా చూడండి:అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..?

నమ్మకం గురించి మాట్లాడుతూ..

"నమ్మకం అనేది అన్నిటికంటే చాలా విలువైనది. ఒకసారి దాన్ని కోల్పోతే మళ్లీ ఎన్ని ఆస్తులు పెట్టినా కూడా తిరిగి పొందలేరు" అని పోస్ట్ పెట్టారు. అయితే రాజ్ నిడిమోరు, సమంతల డేటింగ్ గురించి ఎక్కువగా పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నమ్మకం గురించి పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి:Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల శ్యామలి ఇలా ఇన్‌డైరెక్ట్‌గా వ్యాఖ్యలు చేస్తోంది. కొన్ని రోజుల కిందట కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుందని పోస్ట్ పెట్టారు. అప్పట్లో ఈ పోస్టులు కూడా బాగా చర్చనీయాంశమయ్యాయి. అయితే సమంత, రాజ్ డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే తన భార్య శ్యామలి విడాకులు తీసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. అయితే వీటిపై ఇప్పటి వరకు ఎవరూ కూడా స్పందించలేదు.

ఇది కూడా చూడండి:Coriander Seed Water: కొత్తిమీర గింజల నీరు ఒక దివ్యౌషధం. దీని ప్రయోజనాలను తెలుసుకోండి!

#viral-post #raj-nidimoru #samantha - raj nidimoru #Raj Nidimorus wife Shhyamali De
Advertisment
తాజా కథనాలు