Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...
అరెస్ట్ చేసిన CI బన్నీకి వీరాభిమాని
రీల్ లైఫ్ పుష్పరాజ్ ని అరెస్టు చేయాలనుకున్న షెకావత్ అతడికి శత్రువు. కానీ రియల్ లైఫ్ లో అల్లు అర్జున్ ని చేసిన పోలీస్ మాత్రం బన్నీకి వీరాభిమాని. సంధ్య థీయెటర్ కేసులో బన్నీని అరెస్ట్ చేసిన CI బానోత్ రాజు నాయక్ కు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. ఆయన అల్లు అర్జున్ తో ఒక్కసారైనా ఫొటో దిగాలని కోరుకునేవారట. కానీ చివరికి తన అభిమాన నటుడినే అరెస్ట్ చేసే రోజు వస్తుందని CI రాజు నాయక్ ఎన్నడూ ఊహించలేదంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన అంశం చర్చనీయాంశమైంది.
ఇది ఇలా ఉంటే .. ఈరోజు ఉదయం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జూబ్లీహిల్స్ లోని అతని నివాసానికి చేరుకొని.. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత బన్నీ మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ''జరిగిన ఘటన దురదృష్టకరమని.. ఇది అనుకోకుండా జరిగిందని తెలిపారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చట్టం పట్ల నాకు గౌరవం ఉంది. చనిపోయిన రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి" అని చెప్పారు.
Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు