Pushpa-2 Trailer: దుమ్ములేపుతున్న పుష్ప–2 ట్రైలర్ విడుదల అయి ఒక్కరోజు కూడా కాలేదు కానీ పుష్ప–2 ట్రైలర్ రచ్చ చేస్తోంది. 40 మిలియన్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్ రాబట్టింది. ఈ ట్రైలర్ మరిన్ని రికార్డ్‌లు సృష్టిస్తుందని సినీ పండితులు చెబుతున్నారు. By Manogna alamuru 18 Nov 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Puspa-2 trailer: తెలుగు సినిమా ఫ్యాన్స్‌తో పాటూ టోటల్ ఇండియా ఎదురు చూస్తున్న మూవీ పుష్ప–2. దీని ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదల అయింది. బీహార్‌లోని పాట్నా వేదికగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రెండు నిమిషాల 44 సెకండ్లు నిడివితో విడుదలైన ట్రైలర్ అభిమానుల అంచనాలకు మించి ఉండడంతో సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తుంది. ట్రైలర్ చూసిన అభిమానులు సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. దీంతో ట్రైలర్ విడుదల అయిన కొద్ది సేపటికే 40 వేల మిలియన్ వ్యూస్‌ను దాటేసింది. రానున్న రోజుల్లో మరిన్ని వ్యూస్ వస్తాయని...కొత్త ఇకార్డ్‌లను సృష్టిస్తుందని చెబుతున్నారు. యూట్యూబ్ లో 40 మిలియన్లకు పైగా రియల్ టైం వ్యూస్ తో ఏకంగా 1.4 మిలియన్స్ లైక్స్ సాధించింది. సినిమా ట్రైలర్లో మాస్ ఎలిమెంట్స్ బాగుండడంతో సినీ అభిమానులు రిపీట్ మోడ్ లో ఉంచి ట్రైలర్ ను పదేపదే చూస్తుండడంతో ఈ రికార్డు క్రియేట్ అయింది. Also Read: పెళ్లికాని ప్రసాద్‌లే టార్గెట్.. పెళ్లి చేసుకుని లక్షల్లో కన్నం! ట్రైలర్ లో అల్లు అర్జున్ విజువల్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా బన్నీ మ్యానరిజం పార్ట్ 1 మించి ఉంది. ఇక దేవీ బీజీఎమ్ సినిమాకే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే బన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద పక్కా 2000 వేల కోట్లు కొల్లగొట్టడం ఖాయం అన్నట్లుగా అర్థమవుతోంది. మరో 20 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1000కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కానుంది. Also Read: Delhi: ఢిల్లీలో స్టేజ్ –4 ఆంక్షలు..మొత్తం అన్ని స్కూళ్ళు క్లోజ్ Also Read: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు ఈజీ! #allu-arjun #trailer #tollywood #pushpa-2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి