Delhi: ఢిల్లీలో స్టేజ్–4 ఆంక్షలు..మొత్తం అన్ని స్కూళ్ళు క్లోజ్

దేశ రాజధానిలో గాలి నాణ్యత రోజురోజుకూ మరీ దిగజారిపోతోంది. దీంతో మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో స్టేజ్–4 కింద మరిన్ని నిబంధనలను రేపు ఉదయం 8గంటల నుంచి అమలు చేయనున్నారు. 

New Update
air

Delhi Air Polutions: 

దేశ రాజధాని నగరం దిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకీ క్షీణిస్తోంది. వాయు కాలుష్యం స్థాయిలు పెరగడంపై ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అక్కడ స్టేజ్–3 ఆంక్షలు అమల్లో ఉన్నాయి. కానీ వాయు నాణ్యత సూచీ ఆదివారం రాత్రి 7గంటల సమయానికి 457కి పెరిగింది. దీంతో  సోమవారం నుంచి స్టేజ్–4 ఆంక్షలు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.  దీని ప్రకారం ఢిల్లీలో మొత్తం అన్ని పాఠశాలలను మూసేయనున్నారు. అందరికీ ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పాలని ఆదేశించారు. ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు  6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కమిషన్‌ సూచించింది. GRAP-4 ఆంక్షల ప్రకారం 11-12 తరగతులు మినహా మిగతా విద్యార్థులందరికీ వ్యక్తిగత తరగతులు నిలిపివేయనున్నట్లు తెలిపారు.

Also Read: TS: లగచర్లకు ఎస్టీ కమిషన్..
అలాగే ఢిల్లీలోకి  నిత్యావసర సరుకులను అందించే ట్రక్కులను తప్ప మిగిలిన అన్నింటినీ ఆపేయాలని CAQM ఆదేశించింది. దీంతో  ఎల్‌ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌, బీఎస్‌-4 డీజిల్‌ ట్రక్కులు మాత్రమే అనుమతినివ్వనున్నారు. ఇక ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్నప్పటికీ బీఎస్‌-4 అంతకన్నా పాత డీజిల్‌ రవాణా వాహనాల ప్రవేశంపై నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను వెంటనే నిలిపేయాలని చెప్పారు.  హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్‌ వంతెనలు, పవర్‌ లైన్‌లు, పైపులైన్‌లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులను నిలిపివేయాలని ఆదేశాలు చేశారు. అలాగే ఉద్యోగుల్లో కూడా 5 శాతం మందికే వర్క్ పర్మిషన్ ఇవ్వనున్నారు. మిగిలిన వారందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వనున్నారు. అలాగే వాహనాలను సరి–బేసి నిబంధలనతో రోడ్ల పైకి అనుమతించనున్నారు.

Also Read: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు ఈజీ!

Also Read: MH: కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంట‌ర్

Advertisment
తాజా కథనాలు