/rtv/media/media_files/2024/11/10/ZFoKDBd5s7fvbuoUNnST.jpg)
రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వేకి రాష్ట్ర ప్రజలు సహకరించడంలేదని తెలుస్తోంది. ఈ సర్వేలో భాగంగా వారి వివరాలు ఇచ్చేందుకు ప్రజలు వెనక్కి జంకుతున్నట్లు సమాచారం. పేర్లు, కులం, ఆర్థికపర వివరాలు సహా ఇంకేమైనా వివరాలు చెబితే ఏ పథకాలకు కొతపెడతారో.. రేషన్ కార్డు ఏమైనా రద్దు చేస్తారోనని సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజల నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో సర్వేలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు.
Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్
19వ కాలమ్ ప్రశ్నలతో ఆందోళన
కుటుంబ సర్వేను బహిష్కరించిన గ్రామస్తులు
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2024
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె గ్రామస్తులు ఇంటింటి కుటుంబ సర్వేను బహిష్కరించారు.
ఇటీవల ఈ గ్రామ సరిహద్దులు మార్చుతూ గెజిట్ వచ్చింది.. అయితే గ్రామస్తులు దానిని వ్యతిరేకిస్తూ నెల క్రితం ఎంపీడీవో, తహసీల్దార్లకు… pic.twitter.com/gbuSBrrULy
ముఖ్యంగా సర్వే ప్రశ్నావళిలో 19వ కాలమ్ నుంచి వస్తున్న పలు ప్రశ్నలు వారిలో ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యాపారం టర్నోవర్, ఆదాయ పన్ను చెల్లింపులు, వార్షికాదాయం, బ్యాంక్ అకౌంట్ సమాచారం, భూములు, ధరణి పాసు బుక్ వివరాలు, సహా ఇతర వివరాల సమాచారాన్ని వెల్లడించేందుకు చాలా మంది వెనక్కి జంకుతున్నట్లు తెలుస్తోంది.
పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని చెప్పి కేసీఆర్ ఇచ్చిన రూ.2 వేలు ఇస్తున్నారు
— Telugu Scribe (@TeluguScribe) November 10, 2024
నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో కుల గణన సర్వే కోసం వస్తున్న అధికారులను నిలదీస్తున్న వృద్దులు. pic.twitter.com/GqJOEF8kD3
Also Read: ట్రంప్ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు
ఆర్థిక పరిస్థితుల ప్రశ్నలపై విముఖత
ఇది మాత్రమే కాకుండా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వివరాలు, రిజర్వేషన్ ఫలాలు అడిగినపుడు.. ఆ వివరాలతో మీకేం పని అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం. ఇది కాకుండా సర్వే ప్రశ్నావళి పార్ట్ 2లో ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితులపై ప్రశ్నలు అడిగినపుడు కూడా ప్రజలు తీవ్ర విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. పశు సంపద, వాహనాలు, రేషన్ కార్డు, స్థిరాస్తి, ఇంటికి సంబంధించిన వివరాలు, బ్యాంకు రుణాలు, అప్పులు, ఆస్తులకు సంబంధించిన వివరాలు అడిగినపుడు సమాచారం చెప్పడం లేదని తెలుస్తోంది.
కుల గణనకు ప్రజల నుండి వ్యతిరేకత
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2024
ఆస్తి వివరాలు, లోన్ వివరాలు, రాజకీయ నేపథ్యం ఇలా 100కు పైగా ప్రశ్నలు ఉండడంతో సహకరించని ప్రజలు
మా వ్యక్తిగత వివరాలు మీకు ఎందుకు చెప్పాలంటూ నిలదీత
గతంలో తీసుకున్న ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి, ఆరు గ్యారంటీలు ఎందుకు ఇవ్వట్లేదు అంటూ సిబ్బందిని… pic.twitter.com/ViE6LUzFwu
Also Read: ట్రంప్ గెలుపు...అమెరికాకు గుడ్ బై చెబుతున్న హాలీవుడ్ హీరోయిన్లు
ఎదురు ప్రశ్నలు
వివరాలు తెలుపగపోగా.. ఎదురుప్రశ్నలు కూడా వేస్తున్నట్లు సమాచారం. రుణాలు తాము చెల్లించకుంటే ప్రభుత్వం చెల్లిస్తుందా?.. ఆస్తుల వివరాలు మీకెందుకు చెప్పాలి? అని ప్రజలు ఎన్యుమరేటర్లను నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది తమ ఆదాయ వివరాలు సరిగ్గా చెప్పలేదు.
కులగణన కోసం వచ్చిన వారిని నిలదీస్తున్న ప్రజలు https://t.co/N6kCPIQLvQ pic.twitter.com/GCUJEL2rEP
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2024
Also Read: అయ్యప్ప భక్తులకు అలర్ట్..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ!
ధరణి వివరాలు మీకెందుకు
కుల గణన కోసం వస్తున్న వారిని ప్రశ్నిస్తున్న ప్రజలు
— Telugu Scribe (@TeluguScribe) November 9, 2024
మా పర్సనల్ ఆస్తుల వివరాలు మీకు ఎందుకు చెప్పాలి.. రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారంటీలు ఏమైనయి అంటూ నిలదీస్తున్న ప్రజలు https://t.co/tYwU7Wu4Ce pic.twitter.com/LDjQv1YzEJ
అలాగే ధరణి వివరాలు అడిగినా మీకెందుకు అనే ఎదురు ప్రశ్నలు ఎన్యుమరేటర్లకు ఎదురయ్యాయి. అలాగూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ఏరియాలో కులాంతర, మతాంతర వివాహాలు చేసుకుంటే ఆ వివరాలు చెప్పలేదని తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆధార్ నెంబర్, బ్యాంక్ పాస్ బుక్ వివరాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజలు కూడా తమ ఆస్తి, భూముల వివరాలు చెప్పడానికి వెనుకంజ వేశారు. ఇక మరికొందరేమో రైతు భరోసా రానప్పుడు భూమి వివరాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.