ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రీ రిలీట్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇప్పటికే ముంబై, చెన్నై, పాట్నా, కొచ్చిలో నిర్వహించగా.. నేడు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం వెనుక ఉన్న పోలీస్ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.
ఇది కూడా చూడండి: ముంబైలో దారుణం.. యువతి బట్టలు విప్పించి డిజిటల్ అరెస్ట్..
సాయంత్రం నాలుగు గంటల నుంచే..
ఈ క్రమంలోనే పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు మొదలవుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. దాదాపు ఎనిమిది వేల మందికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పాస్‌లు జారీ చేయడంతో 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
ఇది కూడా చూడండి: విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా..
వాహనాలు పార్కింగ్ కోసం మూడు చోట్ల సదుపాయాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు పలు మార్గాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి వెళ్లే వాహనాలను కృష్ణానగర్ జంక్షన్ మీదుగా పంజాగుట్ట వైపు మళ్లించనున్నారు.
ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
అలాగే మైత్రివనం మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు. అలాగే మైత్రివనం నుంచి బోరబండ వెళ్లే వాహనాలు కృష్ణకాంత్ పార్క్ మీద మోతి నగర్ వైపు మళ్లిస్తారు. ప్రతీ ఒక్కరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు తెలిపారు.
ఇది కూడా చూడండి: పుష్ప-2పై టీడీపీ ఎంపీ ట్వీట్.. వెంటనే డిలీట్