విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా..

గినియాలో మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థంగా ఎన్‌జెరెకోర్‌లో ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ చెలరేగడంతో దాదాపుగా వందమందికి పైగా మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

New Update
Guinea

గినియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎన్‌జెరెకోర్‌లో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో దాదాపుగా వందమందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థంగా ఓ టోర్నమెంట్ నిర్వహించారు.

ఇది కూడా చూడండి: Ap News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు..ఇక నుంచి ఆ విషయంలో జాగ్రత్త!

ఎక్కడ చూసి శవాలే..

దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన జెరెకొరెలో నిన్న ఫుట్‌‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో వేర్వేరు జట్లు అభిమానుల మధ్య వ్యతిరేకత రావడంతో ఘర్షణ ప్రారంభమైంది. ఈ విషాద ఘటనలో వందికిపైగా మృతి చెందారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసిన కూడా మృతదేహాలే కనిపిస్తున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Health Tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు పిల్లలకు శాపమా?

ఇది కూడా చూడండి: Health Tips: ఈ మూడు తింటే కొవ్వంతా కరగాల్సిందే

 

 

ఇది కూడా చూడండి: AP Rains: ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. నేడు స్కూళ్లకు సెలవు

Advertisment
Advertisment
తాజా కథనాలు