ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్‌గా దుమ్ము దులిపేసింది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు బద్దలు కొడుతోంది. ఇప్పటికీ పుష్ప 2 మానియా తగ్గలేదు. ఎక్కడ చూసిన పుష్ప2 పేరే వినిపిస్తోంది. ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు.. కొత్త రికార్డులను సైతం క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది.
Also Read: రుతుపవనాల సీజన్ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!
22 రోజుల్లో రూ.1719 కోట్ల గ్రాస్
రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలనే ఉద్దేశంతో బరిలోకి దిగిన ఈ సినిమా ఆ కలెక్షన్లను అతి కొద్ది రోజుల్లోనే క్రాస్ చేసేసింది. కేవలం 9 రోజుల్లో వెయ్యికోట్ల మార్క్ దాటేసింది. ఇక ఇప్పుడు రూ.2వేల కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. సినిమా రిలీజ్ అయి మూడు వారాలు దాటినా.. కలెక్షన్స్ మాత్రం ఎక్కడా డ్రాప్ కాలేదు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 22 రోజులకు గానూ రూ.1719 కోట్ల గ్రాస్ రాబట్టి తెలుగు సినిమా స్టామినా ఏంటో తెలియజేసింది.
Also Read: నాగార్జునాసాగర్ దగ్గర హై డ్రామా..భద్రత విషయంలో గందరగోళం
పుష్ప 2 తొలి స్థానం
దీంతో ఈ ఏడాది అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా పుష్ప2 తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాటలో పయనిస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప2 ప్రియులకు మూవీ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. హీరో అల్లు అర్జున్ న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఓ ట్రీట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదేంటనే విషయానికొస్తే..
Also Read: కేటీఆర్ కోసం పాట పాడిన కొడుకు..ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్
థియేటర్‌లో పుష్ప 2 మూవీ రన్ టైం 3గంటల 21 నిమిషాలు ఉంది. ఇప్పటికే రన్ టైం ఎక్కువగా ఉందని మేకర్స్ కొన్ని సీన్లను కట్ చేసేశారట. కట్ చేసిన సీన్లు ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసి సినీ ప్రేక్షకులు మంచి మంచి సీన్లు కట్ చేసేశారని కామెంట్లు చేశారు. అలా ఫీల్ అవుతున్న వారికి హ్యాపీ న్యూస్ రానున్నట్లు తెలుస్తోంది.
Also Read: రామాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన విగ్రహాలు
న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదే
న్యూ ఇయర్ నుంచి కట్ చేసిన సీన్లను సినిమాలో యాడ్ చేయనున్నట్లు సమచారం. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్‌లో హీరో ఇంట్రెడక్షన్ సీన్ జపాన్‌లో జరుగుతుంది. ఆ సీన్ అర్ధాంతరంగా ముగించినట్లు అనిపిస్తుంది. అయితే దానికి కొన్ని సీన్లు ఇప్పుడు యాడ్ చేసి క్లారిటీ ఇవ్వనన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సీన్లకు సంబంధించి బన్నీ డబ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం. దీంతో సినీ ప్రియులు, బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.