నాగార్జునా సాగర్ డ్యాం భద్రతను ఇరు వైపులా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఎస్‌పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. అయితే జల వివాదం నేపథ్యంలో నాగార్జుసాగర్ డ్యామ్ పర్యవేక్షణ బాధ్యతలను కేఆర్‌ఎంబీ.. సీఆర్‌పీఎఫ్‌కు అప్పగించింది. అయితే ఈరోజు ఉదయం డ్యాం దగ్గర కీలకపరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ వైపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీఆర్పీఎఫ్ తమ బాధ్యతలను ఉపసంహరించుకున్నాయి. దాంతో వారి స్థానంలో మళ్ళీ ఎస్‌పీఎఫ్ రంగంలోకి వచ్చింది. కానీ సాయంత్రం ఏడు అయ్యేసరికి సాగర్ ప్రధాన డ్యాంని సీఆర్పీఎఫ్ బలగాలు ఆధీనంలో తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై తమకు ఎలాంటి సమాఆరం లేదని చెబుతున్నారు, డ్యామ్ ఎస్‌ఈ శ్రీధరరావు. అదంతా కేఆర్‌ఎంబీనే చూస్తుందని చెప్పారు.మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఉదయం డ్యాంపైన భద్రతను ఉపసంహరించి.. సాయంత్రం తిరిగి విధుల్లోకి చేరారని..సీఆర్‌పీఎఫ్ సహాయ కమాండెంట్ సహీర్ చెప్పారు. ఇక గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. బోర్డుకు ఇండెంట్ ఇస్తున్నా తెలంగాణను పదేపదే అడగాల్సి వస్తోందని..13వ గేటు నుంచి తమ వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్ చేసుకుంటామని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. Also Read: KTR: కేటీఆర్ కోసం పాట పాడిన కొడుకు..ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్