Producer SKN Controversy: ‘బేబీ’ని టార్గెట్ చేసిన నిర్మాత ఎస్‌‌కేఎన్.. ఇద్దరి మధ్య జరిగింది ఇదే!

నిర్మాత ఎస్‌కేఎన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నటి వైష్ణవి చైతన్యను ఉద్దేశించే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘బేబీ’ హిట్ తర్వాత అతడి సినిమాలు కాకుండా వేరే ప్రాజెక్టులు ఒప్పుకుందని.. అందుకే ఆమెపై కోపంతో నిర్మాత ఈ వ్యాఖ్యలు చేశాడని నెటిజన్లు ఫైరవుతున్నారు.

New Update
Producer SKN controversial comments on Baby movie heroine Vaishnavi Chaitanya

Producer SKN controversial comments on Baby movie heroine Vaishnavi Chaitanya

ప్రొడ్యూసర్ SKN వివాదాల్లో చిక్కుకున్నారు. తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగులో తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏం జరుగుతుందో తనకు తెలిసి వచ్చిందని అన్నారు. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయనంటూ అతడు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నిర్మాత ఎస్‌కేఎన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు! 

ఆ హీరోయిన్‌పై కోపం

తెలుగు ఇండస్ట్రీ (Telugu Film Industry) లో సినిమాలు తీస్తున్న మీరు.. సొంత భాష అమ్మాయిలను తీసుకోబోమని చెప్పడం సరైన పద్దతి కాదని మండిపడుతున్నారు. అయితే నిర్మాత ఎస్‌కేఎన్ తెలుగు హీరోయిన్, ‘బేబీ’ మూవీ నటి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ను ఉద్దేశించే ఈ కామెంట్లు చేశాడని నెటజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. ‘బేబీ’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వైష్ణవి క్రేజ్ బాగా పెరిగిపోయింది. 

తనను కాదని

దీంతో తమ సినిమాలు కాకుండా వేరే ప్రాజెక్టులు ఒప్పుకుందని.. అందుకే ఆమెపై నిర్మాత కోపంగా ఉన్నాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఒక సినిమా వేదికపై ఆలోచించి మాట్లాడాలని.. తెలుగులో సినిమాలు చేస్తూ.. తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేయబోమని మాట్లాడితే ఎలా అని ఫైర్ అవుతున్నారు. అది మాత్రమే కాకుండా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ హీరోయిన్ కాయద్‌పై చేసిన వ్యాఖ్యలపై కూడా కొందరు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. అదే వేదికపై ఆమె పేరుతో కాయలు, పండ్లు అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీసింది. 

Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా 

ఎస్‌కేఎన్ ఏమన్నాడంటే?

‘‘తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే.. తెలుగు రాని అమ్మాయిలనే మేం ఎక్కువగా లవ్ చేస్తుంటాం. ఎందుకంటే తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే తర్వాత ఏం జరుగుతుందో నాకు బాగా తెలిసింది. అందువల్ల నేను.. మా దర్శకుడు సాయి రాజేశ్ తెలుగు రాని అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం’’ అని అన్నారు.

Also Read :  Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్‌ ఛాన్స్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు