Singanamala Ramesh Babu: పవన్, మహేశ్ సినిమాలతో రూ.100 కోట్లు నష్టపోయా.. వారు కనీసం పట్టించుకోలేదు: నిర్మాత ఎమోషనల్!

ప్రొడ్యూసర్ శింగనమలై రమేష్ బాబు టాలీవుడ్ అగ్ర హీరోల సినిమాలతో భారీగా నష్టపోయానని అన్నారు. తాజాగా ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన పవన్ కళ్యాణ్‌తో ‘కొమరం పులి’, మహేశ్ బాబుతో ‘ఖలేజా’ సినిమాలు తీసి రూ.100 కోట్లు నష్టపోయినట్లు తెలిపారు.

New Update
producer singanamala ramesh babu press meet

producer singanamala ramesh babu press meet

ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలను నిర్మించిన ప్రొడ్యూసర్ శింగనమల రమేష్ బాబు తాజాగా మీడియా ముందుకు వచ్చి ఎమోషనల్ అయ్యారు. ఆయన ఓ కేసు విషయంలో 75 రోజుల పాటు ఉండి బయటకొచ్చిన తర్వాత దాదాపు 14 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. అనంతరం ఈ కేసును విచారించిన కోర్టు ఆయన్ను నిర్దోషిగా తేల్చి.. ఇటీవల కేసు కొట్టివేసింది. 

Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్  షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్

ఈ తరుణంలోనే ఆయన తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు. ఆయన గతంలో నిర్మించిన చిత్రాలు.. వాటి వల్ల వచ్చిన లాభాల గురించి తెలిపారు. ఇద్దరు స్టార్ హీరోల వల్ల దాదాపు రూ.100 కోట్లు నష్టపోయానని పేర్కొన్నాడు. 

Also Read: Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్

చిత్రీకరణకే 3ఏళ్లు

ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో సినిమాలు ఎలా లేదన్నా.. ఆరు లేదా ఏడాదికి పూర్తయ్యేవి. కానీ తాను నిర్మించిన కొన్ని చిత్రాలు మాత్రం చాలా ఏళ్లు పట్టాయని అన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘కొమరం పులి’, మహేశ్ బాబు నటించిన ‘ఖలేజ’ వంటి అగ్రహీరోల చిత్రాలు చిత్రీకరణలోనే దాదాపు 3ఏళ్లు పట్టిందని అన్నారు. 

Also Read: మూడు గ్రూపులుగా ఎస్సీలు.. ఏ కులం ఏ గ్రూపులో ఉందో తెలుసా?.. ఫుల్ లిస్ట్ ఇదే!

రూ.100 కోట్ల వరకూ నష్టపోయా

అయితే అందుకు చాలా కారణాలే ఉండొచ్చు అన్నారు. ఆ ఇద్దరి పెద్ద హీరోల చిత్రాల వల్ల చాలా నష్టపోయినట్లు తెలిపారు. సుమారు రూ.100 కోట్ల వరకూ నష్టపోయానని పేర్కొన్నారు. ఆ సమయంలో తనకు ఎవరూ కనీసం ఫోన్ కూడా చేయలేదని.. ఎవరూ సపోర్ట్ చేయలేదని ఎమోషనల్ అయ్యారు. 

Also Read: నాకు పెళ్లి అవుతుంది..ఇప్పటికైనా నా ప్రొఫెల్‌ ని తీసేయండిరా బాబు...అదానీ చిన్న కుమారుడి స్పెషల్‌ రిక్వెస్ట్‌!

ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు

మరోవైపు తన కేసు గురించి తెలిపారు. తనపై కేసు పెట్టిన వాళ్లు ఇండస్ట్రీ వాళ్లు కాదని అన్నారు. కానీ తాను తప్పుడు కేసులో చిక్కుకున్నప్పుడు మాత్రం ఏ ఒక్క హీరో తనకు ఫోన్ చేయలేదని ఆవేదనకు గురయ్యారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు