బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'డాకు మహారాజ్'. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా విడుదల కాబోతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ పాల్గొన్నారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో నాగవంశీ.. 'డాకు మహారాజ్' సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. "#Chiranjeevi gari fans nannu tittukunna paravaledu. As a #Balakrishna gari fan ga cheptunanu .. a cinema (referring to Bobby & Chiru film) kante ee cinema chala baga teesaru."- #NagaVamsi [Producer] pic.twitter.com/vkxe6OAyj1 — Movies4u Official (@Movies4u_Officl) December 23, 2024 Also Read : ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే వాళ్ళు తిట్టుకున్నా పర్లేదు.. డైరెక్టర్ బాబీ.. 'డాకు మహారాజ్' సినిమాను 'వాల్తేరు వీరయ్య' సినిమా కంటే బాగా తీశారు. ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదని సంచలనస్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మాములుగా నాగవంశీ.. ప్రెస్ మీట్ లలో కాస్త ఓవర్ గానే రియాక్ట్ అవుతుంటాడు. అయితే ఈసారి బాలయ్యను హైలైట్ చేయాలనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ సినిమాను తక్కువ చేసి మాట్లాడారు. మరి ఈ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. Also Read: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ 'డాకు మహారాజ్' సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చాందినీ చౌదరి, ఊర్వశి రౌటేలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.