Preity Mukhundhan: ప్రభాస్‌కు ఫిదా అయిపోయా.. మనసులో మాట చెప్పేసిన ‘కన్నప్ప’ బ్యూటీ ప్రీతి ముకుందన్

ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ అని 'కన్నప్ప' నటి ప్రీతి ముకుందన్ అన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతినిచ్చిందని, ప్రభాస్ ఎంతో సరదాగా, మర్యాదగా ఉంటారని ప్రశంసించారు. ఆయన మంచితనానికి ఫిదా అయిపోయాను అని పేర్కొన్నారు.

New Update
Preity Mukhundhan

Preity Mukhundhan

మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'కన్నప్ప'లో హీరోయిన్‌గా నటించిన ప్రీతి ముకుందన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్ అని, ఆయనతో కలిసి పనిచేయడం తన కెరీర్‌లోనే ఒక గొప్ప, మరచిపోలేని అనుభూతిని ఇచ్చిందని ప్రీతి ముకుందన్ పేర్కొన్నారు. 

Also Readఏరా బుద్దుందా..  అభిమానిని తోసేసిన రాజమౌళి.. వీడియో వైరల్!

ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్

‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో శక్తివంతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. ప్రభాస్‌తో కలిసి తెరను పంచుకోవడం అద్భుతమని, ఆయన ఎంతో సరదాగా, మర్యాదగా ఉంటారని ప్రీతి ముకుందన్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. ప్రభాస్‌తో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ భయంగా అనిపించలేదని, ఆయన చాలా ఓపెన్‌గా ఉంటారని, ఎవరి సందేహాలనైనా తీర్చడానికి సిద్ధంగా ఉంటారని ప్రీతి వివరించారు. 

Also Read: టెక్సాస్‌లో భారీ వరద బీభత్సం.. 160 మందికి పైగా..!

‘‘ప్రభాస్‌తో కలిసి పనిచేయడం ఒక మెమోరబుల్ ఎక్స్‌పీరియన్స్. ఆయన చుట్టూ ఒక ప్రత్యేకమైన వైబ్ ఉంటుంది. ఆయన ఎప్పుడూ ఎవరినీ చిన్నగా చేసి చూడరు. సెట్‌లో అందరితో చాలా స్నేహంగా, గౌరవంగా ఉంటారు. ఆయన తన స్టార్‌డమ్‌ను ఎప్పుడూ ఎదుటివారిపై చూపించరు. ఆయన సాధారణ వ్యక్తిలా మాతో హ్యాపీగా ఉండేవారు. ప్రభాస్‌తో మాట్లాడేటప్పుడు నాకు ఎప్పుడూ భయంగా అనిపించలేదు. ఆయన చాలా ఓపెన్. ఆయన మంచితనానికి నేను ఫిదా అయిపోయాను’’ అని ప్రీతి ముకుందన్.. ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ప్రశంసలు కురిపించారు. 

Also Read: నాగ్‌పూర్‌లో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి 74 ఏళ్ల వ్యక్తి మృతి

‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్ర ద్వారా సినిమాకి మరింత బలాన్ని చేకూర్చారు. ఈ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని, ఇది తన సినీ కెరీర్‌లో ఒక ముఖ్యమైన ఘట్టమని ప్రీతి ముకుందన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ప్రీతి ముకుందన్ ‘‘ఓం భీమ్ బుష్’’ చిత్రంతో తెలుగు తెరంగేట్రం చేశారు. ‘కన్నప్ప’ ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు