Raja Saab Song: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నుంచి కొత్త వీడియో సాంగ్ రిలీజ్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన 'ది రాజా సాబ్' మూవీ జనవరి 9న రిలీజ్ అయింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్. తాజాగా రాజే యువరాజే వీడియో సాంగ్ యూట్యూబ్‌లో రిలీజై ట్రెండ్ అవుతోంది.

New Update
Raja Saab Song

Raja Saab Song

Raje Yuvaraje Full Video Song

Raja Saab Song: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Director Maruthi) దర్శకత్వంలో తెరకెక్కిన పాన్-ఇండియా చిత్రం ‘ది రాజా సాబ్’ తాజాగా వార్తల్లో ఉంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటించారు.

Also Read: ప్రభాస్ ‘సలార్ 2’ క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది..

చిత్రబృందం ఇటీవల ‘రాజే యువరాజే’ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఈ పాట సినిమా ఒక ముఖ్యమైన సీన్‌లో, ప్రభాస్ నిధి అగర్వాల్‌ను చూసిన సమయంలో ప్లే అవుతుంది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను అద్వితీయ వొజ్జల, బేబీ సింగర్ రియా సీపాన ఆలపించారు. కృష్ణకాంత్ లిరిక్స్ సమకూర్చారు.

‘ది రాజా సాబ్’ జనవరి 9న విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ భారీ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఇప్పుడు ఈ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

Also Read :  హీరో అల్లరి నరేశ్‌ ఇంట తీవ్ర విషాదం..

Advertisment
తాజా కథనాలు