Raja Saab Release Date: కన్‌ఫ్యూజ్‌లో 'రాజా సాబ్'.. ఫ్యాన్స్ కు మళ్ళీ నిరాశేనా ?

ప్రభాస్ మారుతీ కాంబోలో వస్తున్న రాజా సాబ్ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రావడం లేదు. మొదట ఏప్రిల్ 10న రిలీజ్ అనుకున్నప్పటికీ వాయిదా పడింది. మరి దీనిపై డైరెక్టర్ మారుతీ ఏం క్లారిటీ ఇస్తాడో ఇంకొన్నాళ్ళు వేచి చూడాలి.

New Update
Raja Saab Release Date

Raja Saab Release Date

Raja Saab Release Date: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ఫ్యాన్స్ కి చేదు వార్త... ఏప్రిల్ 10న రిలీజ్ అనుకున్న రాజా సాబ్  వాయిదా పడింది, దాన్ని వాయిదా వేసిన తరువాత కొత్త రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ మూవీ టీం నుండి మాత్రం ఎలాంటి స్పందనా లేదు. వచ్చేది ఎలాగో సమ్మర్ కాబట్టి రాజా సాబ్ కి ఇది మంచి అవకాశం కానీ సమ్మర్ రిలీజ్ కూడా లేనట్టుగానే తెలుస్తోంది. మరి రాజా సాబ్ ఎప్పుడు వస్తాడు అన్నది ఇప్పుడు పెద్ద ప్రెశ్నగా మారింది.

Also Read: సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డ రాహుల్‌ గాంధీ

ఒక సెంటిమెంట్ ప్రకారం రాజా సాబ్ జూలై 24న రాబోతుంది అని ప్రచారం జరుగుతోంది. బాహుబలి ది బిగినింగ్ జూలై 24న విడుదల కావడంతో, రాజా సాబ్ ని కూడా అదే డేట్ కి రిలీజ్ చేస్తే బాహుబలి సెంటిమెంట్ వర్కౌట్ అవుతోందని చిన్న చర్చ నడుస్తోంది. అయితే, దర్శకుడు మారుతీ మాత్రం దసరా లేదా దీపావళి పండుగలను టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. కానీ అది కూడా గ్యారంటీ లేదు. వివిధ కారణాల వల్ల రాజా సాబ్ షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది కాబట్టి పనులు అన్ని పూర్తి చేసుకొని కనీసం ఈ ఏడాది దసరా, దీపావళి కైనా వస్తే బాగుండు అని ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Also Read: ఈరోజు స్పెషల్ ఇదే.. మహిళల చేతికి మోదీ సోషల్ మీడియా అకౌంట్లు

మూడు గంటల 30 నిమిషాల ఫుటేజ్

ఇక షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటిదాకా షూట్ చేసిన భాగం మొత్తం మూడు గంటల 30 నిమిషాల ఫుటేజ్ వచ్చినట్లు సమాచారం. అదీ కాక మేజర్ గా ఇంకా మూడు పాటలు షూట్ చేయాల్సి ఉంది. కానీ హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వేరే  సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో ఇప్పట్లో ఆ సాంగ్స్ షూటింగ్ పూర్తి అయ్యేలాగా కనిపించడం లేదు. ఏదిఏమైనా సరే 3 గంటల 30 నిమిషాల సినిమా అంటే అదీ హారర్ జోనర్ లో రిస్క్ అనే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు సినిమాని ఎడిట్ చేసి నిడివి తగ్గించే పనిలో ఉన్నారు మూవీ టీమ్. అలాగే ప్రభాస్ కి కూడా ఈ మధ్య ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదని వార్తలు వస్తున్నాయి, ఇవన్నీ చూసుకుంటే రాజా సాబ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మొత్తం మీద, రాజా సాబ్ ఎప్పుడు వస్తాడు అన్నది ఎవ్వరికి అంతు చిక్కని ప్రెశ్నలా మారింది. 2025 సెకండ్ హాఫ్ లో విశ్వంభర, స్వయంభు, అఖండ 2, సంబరాల ఏటిగట్టు, కాంతారా చాప్టర్ 1, ఓజి వంటి బడా బడా పాన్ ఇండియా సినిమాలు అన్ని విడుదలయ్యే అవకాశం ఉంది.వాటితో  క్లాష్ లేకుండా రాజా సాబ్ సోలో రిలీజ్ కోసం చూస్తున్నారట. 

బాహుబలి తరువాత ప్రభాస్ సాహో, కల్కి వంటి సినిమాలు సింగిల్ రిలీజ్‌గా వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. అలానే రాజా సాబ్ కూడా సోలో రిలీజ్ తీసుకుంటే కలెక్షన్స్ పరంగా బెటర్. మరి దీనిపై డైరెక్టర్ మారుతీ ఏం క్లారిటీ ఇస్తాడో ఇంకొన్నాళ్ళు వేచి చూడక తప్పదు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు