'స్పిరిట్' స్టోరీ లీక్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ గ్యారెంటీ

'స్పిరిట్' స్టోరీ లైన్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ మూవీలో కొరియన్ స్టార్ సియోక్ ఇంటర్నేషనల్ మాఫియా డాన్‌ గా కనిపిస్తారని, ప్రభాస్‌ అతన్ని ఎదిరించే ఇండియన్ పోలీస్‌ ఆఫీసర్‌ గా కనిపిస్తారట.

New Update
spirit00

‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ‘స్పిరిట్’ అనే మూవీలో నటించబోతున్న విషయం తెలిసిందే. డార్లింగ్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాలన్నింటిలో ఈ మూవీపైనే విపరీతమైన హైప్ ఉంది. కాంబినేషన్ అలాంటిది మరి.

Also Read :  జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

'యానిమల్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీని మరింత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాడు. ఇందులో ప్రభాస్‌ను ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూడని విధంగా చూపించబోతున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

స్టోరీ ఇదేనా..?

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాలో ప్రభాస్‌ రూత్‌ లెస్‌ కాప్‌ గా కనిపించబోతున్నారని చెప్పారు. అంతేకాదు ఫస్ట్ టైమ్ డార్లింగ్‌ యూనిఫామ్‌ లో కనిపిస్తారని క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో అప్డేట్ ట్రెండ్ అవుతుంది. ఈ మూవీలో కొరియన్ స్టార్ సియోక్  ఇంటర్నేషనల్ మాఫియా డాన్‌ గా కనిపిస్తారని, ప్రభాస్‌ అతన్ని ఎదిరించే ఇండియన్ పోలీస్‌ ఆఫీసర్‌ గా కనిపిస్తారట. 

Also Read :  చీరకట్టులో సెగలు పుట్టిస్తున్న మాళవిక.. ఎలా మెరిసిపోతుందో చూశారా?

అంతేకాదు ఇంటర్నేషనల్ మాఫియా చేసే అక్రమాలన్నింటినీ ప్రభాస్ బట్టబయలు చేస్తారని, సినిమాలో సియోక్ వర్సెస్ ప్రభాస్ సీన్స్‌ ను సందీప్‌ నెక్ట్స్ లెవల్‌లో డిజైన్ చేసున్నట్లు సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా ఈ వార్త ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం ది రాజాసాబ్‌, ఫౌజీ సినిమాల షూట్‌ లో పాల్గొంటున్న ప్రభాస్‌.. ఆ తరువాత 'స్పిరిట్' సెట్స్ లో అడుగు పెట్టనున్నాడు.

Also Read : పెళ్లయిన 12 ఏళ్లకు.. బిడ్డకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్

#tollywood #prabhas #spirit
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు