Prabhas - Prashanth Varma: ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ వ‌ర్మ కాంబోలో 'బ్ర‌హ్మ‌రాక్ష‌స్‌'.. అస్సలు ఊహించలేదుగా..!

ప్రభాస్ ఫాన్స్ కి అదిరిపోయే అప్‌డేట్ ఒకటి బయటకి వచ్చింది, ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ల్ లో ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స్‌’ అనే సినిమా రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి ప్రభాస్ పై లుక్ టెస్ట్ కూడా ఈ గురువారం చేయనున్నట్లు సమాచారం.

author-image
By Lok Prakash
New Update
Prabhas - Prashanth Varma

Prabhas - Prashanth Varma

Prabhas - Prashanth Varma: హ‌నుమాన్(Hanuman) సినిమాతో అందరి చూపు తన వైపు తిప్పుకున్న యంగ్ డైరెక్టర్  ప్ర‌శాంత్ వ‌ర్మ. ఈ డైరెక్టర్ క్రేజ్ ఎంతలా పెరిగిందంటే బాలీవుడ్ హీరోలు సైతం ప్ర‌శాంత్ వ‌ర్మ‌తో సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఆ మధ్యకాలంలో ర‌ణ్‌వీర్ సింగ్‌తో ఒక ప్రాజెక్టు కూడా అనుకున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ, ర‌ణ్‌వీర్ తో కలిసి ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స్‌’(Brahma Rakshas) అనే సినిమా ప్లాన్ చేసాడు దీనికి సంబందించిన లుక్ టెస్ట్ ఫోటో షూట్ కూడా చేశాడు. కానీ కొన్ని సాంకేతిక ఇబ్బందుల వ‌ల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. తరువాత, నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్ష‌జ్ఞ తో ఒక కొత్త ప్రాజెక్ట్ అనుకున్నాడు కానీ అది కూడా ప్రారంభం కాలేదు.

Also Read:మజాకా రివ్యూ.. సందీప్‌ కిషన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

ప్ర‌భాస్ పై లుక్ టెస్ట్..

అయితే ప్రశాంత్ ఇప్పుడు మళ్ళీ ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స్‌’పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈసారి, ఏకంగా ప్ర‌భాస్ తో ఈ ప్రాజెక్టును చేయాలనీ ఫిక్స్ అయ్యాడట ప్రశాంత్. అయితే ప్ర‌భాస్‌- ప్రశాంత్ కాంబోలో సినిమా ఉండబోతుంది అని ముందు నుండే ఇండస్ట్రీలో గాసిప్స్ జ‌రుగుతున్నాయి, ఇప్పుడు అది నిజ‌మైంది. ప్రభాస్ కూడా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చేసాడని త్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందా అని ఇండస్ట్రీ వర్గాల టాక్. గురువారం, ప్ర‌భాస్ పై లుక్ టెస్ట్ కూడా ఈ గురువారం చేయనున్నట్లు సమాచారం.

Also Read:మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?

ప్ర‌భాస్ ప్రస్తుతం ‘ఫౌజీ’ సినిమాతో బిజీగా ఉన్నారు, అలాగే ‘రాజాసాబ్‌’ కూడా పూర్తిచేయాల్సి ఉంది. మరోవైపు, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాతో రెడీగా ఉన్నారు. దీంతో, ‘బ్ర‌హ్మరాక్ష‌స్‌’ ప్రాజెక్ట్ ఎప్పటికి  షూటింగ్ మొదలవుతుందో చూడాలి.

Also Read:బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!

Advertisment
తాజా కథనాలు