/rtv/media/media_files/2025/02/01/ufZezFHhe74DDrjekHto.jpg)
Prabhas Spirit Updates
Prabhas Spirit Updates: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎన్నో భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓకే సమయంలో రెండు సినిమాలు చేస్తున్నాడు, కానీ అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తున్న సినిమా మాత్రం ‘స్పిరిట్’ (Spirit), కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ కు నోచుకోవడంలేదు. ప్రభాస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం కావడంతో, ఫ్యాన్స్‌కు ఫుల్ డిస్సపాయింట్ లో ఉన్నారు.
ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ (The Raja Saab), హను రాఘవపూడి ‘ఫౌజీ’ (Fauji), సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) సీక్వెల్ వంటి ప్రాజెక్టులలో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమాలన్నీ ఆలస్యం కావడానికి ప్రభాస్ షూటింగ్స్ కి విరామాలు ఎక్కువ తీసుకోవడం కారణమని అంటున్నారు. ఆయనకి షూటింగ్స్ మధ్యలో యూరప్ కు వెళ్లడం అలవాటు. అక్కడ రెండు మూడు వారాలు గడిపి వచ్చేస్తాడు.
అయితే, ప్రభాస్ పెద్ద స్టార్ కావడంతో దర్శక, నిర్మాతలు అతనిపై ఒత్తిడి పెట్టకుండా షూటింగ్స్ పూర్తి చేస్తూ ఉంటారు. ఒకసారి డార్లింగ్ ప్రాజెక్టుకు కమిట్ అయితే, ఎక్కువ షెడ్యూల్స్ ఒకేసారి రెస్ట్ లేకుండా పూర్తి చేస్తారని తెలిసిన విషయమే. అందుకే, ఇప్పుడు అంతా ప్రభాస్ కోసం సైలెంట్‌గా ఎదురు చూస్తున్నారు.
Also Read: ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!
ఫిబ్రవరి లో ‘ది రాజా సాబ్’ మూవీకి ప్రభాస్ డేట్స్...
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’ మూవీకి కూడా ప్రభాస్ డేట్స్ అవసరం ఉన్నాయి. ఫిబ్రవరి లో ప్రభాస్ ఈ షూటింగ్ కోసం తన డేట్స్ కేటాయించాడట. కానీ, ‘స్పిరిట్’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మాత్రం ఇంకా ఆలస్యమవుతుంది.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
‘స్పిరిట్’ సినిమా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది, కానీ ప్రభాస్ ఇంకా అందుబాటులో రాలేదు. అందువల్ల, సందీప్ ఇంకొన్ని నెలలు ఆగక తప్పేలాలేదు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’ చిత్రంలో బిజీగా ఉన్నాడు, కానీ ఈ సినిమా షూటింగ్ కూడా ఆలస్యం కావడంతో ‘స్పిరిట్’ షూటింగ్ మరో మూడు నెలలు పోస్ట్‌పోన్ అవ్వనుందట. ఆ తర్వాత 2025 చివర్లో ప్రభాస్ ‘కల్కి’ సీక్వెల్ షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది.