Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ..!

పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట. ఆయన నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను జనవరి 1న మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడినట్లు సమాచారం.

New Update
harihara veeramallu first song

harihara veeramallu first song

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఛాన్స్ దొరికినప్పుడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనున్నారు. ప్రస్తుతానికి ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

అయితే చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే.. కొత్త సంవత్సరం సందర్భంగా, ఈ సినిమా నుంచి ఓ పాట విడుదల చేయబోతున్నారట. జనవరి 1న మధ్యాహ్నం 12 గంటలకు ఈ పాటను విడుదల చేస్తారని సమాచారం. 

ALSO READ: రేవంత్ రెడ్డి గలీజ్‌గా బిహేవ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు!

ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్..

విశేషం ఏంటంటే.. ఈ పాటను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా పాడారట. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ పాటను ఆయనే పాడారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పటివరకు ఈ వార్తపై చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వార్త నిజమైతే, న్యూ ఇయర్ కు పవన్ అభిమానులకు ఇది స్పెషల్ గిఫ్ట్ అని చెప్పొచ్చు.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

ALSO READ: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి...

మొదటి భాగం మార్చి 28న విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన నుంచి రాబోతున్న ఫస్ట్ మూవీ ఇదే కాబోతుండటంతో ఫ్యాన్స్ తో పాటూ మూవీ లవర్స్ సైతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు