డాక్టర్ మన్మోహన్ సింగ్...ఆర్ధిక వేత్త. ఫైనాన్స్ రంగంలో నిష్ణాతులు. 1932 సెప్టెంబర్ 26న, పశ్చిమ పంజాబ్‌లోని గహ్ అనే ప్రదేశంలో జన్మించారు. ప్రస్తుతం ఇది పాకిస్తాన్‌లో ఉంది.
చదువు, ఉద్యోగం..
మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్శిటీలో 1952లో బిఏ, 1954లో ఎంఏ డిగ్రీలు పొందారు. మన్మోహన్ రెండు డిగ్రీలు ఆర్థికశాస్త్రంలోనే చేశారు. దీని తరువాత 1957లో కెంబ్రిడ్జ్ కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్ (ఫస్ట్ క్లాస్ ఆనర్స్) పట్టా పొందారు. 1962లో ఆక్స్‌ఫర్డ్ నుంచి ఎం.ఎ. డి.ఫిల్, హోనరిస్ కాసా నుంచి డి.లిట్ డిగ్రీలు సాధించారు. చదువు అయ్యాక 1957-59 ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులు పని చేశారు. ఆ తరువాత 1959-63 రీడర్‌గా..1963-65 పంజాబ్ వర్సిటీ, చండీగఢ్‌లో ప్రొఫెసర్ గా ఉన్నారు. 1966-69 ఐక్యరాజ్య సమితిలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా, 1969-71 ఢిల్లీ వర్సిటీ, అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్‌గా మన్మోహన్ పని చేశారు. ఆ తరువాత 1972-76 ఆర్థికశాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారు, 1976-80 రిజర్వు బ్యాంకు డైరెక్టర్, ఐడీబీఐ డైరెక్టర్, ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత్ విభాగం గవర్నర్, ఐబీఆర్‌డీ భారత విభాగం గవర్నర్ బాధ్యతలు నిర్వర్తించారు. 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు. అప్పుడే అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు దృష్టిని మన్మోహన్ సింగ్ ఆకర్షించారు. ఆయనను తీసుకువచ్చి భారత ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
రాజకీయ చరిత్ర...
1991-96 మధ్య పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మన్మోహన్ సింగ్ హయాంలో అత్యధిక జీడీపీ 10.8శాతం వృద్ధిరేటు నమోదైంది. మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది. ఇది కూడా మన్మోహన్ చలవే. 2004లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ రోజూ 18 గంటలు అవిశ్రాంతంగా పని చేశారు. 2005లో సమాచార హక్కు చట్టం తీసుకువచ్చారు.2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. ఆర్ధిక మంత్రిగా ఎంత సమర్ధవంతంగా పని చేశారో...ప్రధానిగా కూడా అదే విధంగా తనదైన ముద్ర వేశారు మన్మోహన్ సింగ్. తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించారు.
అవార్డులు...
1987లో మన్మోహన్‌కు పద్మవిభూషణ్ ఇచ్చింది భారత ప్రభుత్వం. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. 1993, 94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు. 2002లో ఔట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు పొందారు. 2010లో వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు వరించింది. ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్‌కు చోటు దక్కింది.