VIRAL VIDEO: రేవంత్ రెడ్డి గలీజ్‌గా బిహేవ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు!

సంధ్య థియేటర్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై నటి మాధవిలత ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదన్నారు. ఇండస్ట్రీ వాళ్ళని కాళ్ళకింద పెట్టుకోవాలని రేవంత్ చూస్తున్నాడన్నారు. కష్టపడి ఈస్థాయికి వచ్చి ఎందుకింత గలీజుగా బిహేవ్ చేస్తున్నారని మండిపడ్డారు.

New Update
Actress Madhavi Latha

cm revanth reddy - Actress Madhavi Latha

సంధ్య థియేటర్ వ్యవహారం ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై అల్లు అర్జున్‌ను కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. సీఎం రేవంత్ చేస్తున్నది కరెక్టే అని కొందరు అంటుంటే.. ఇంకొందరు కావాలనే రేవంత్ ఇరికిస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై ఓ నటి స్పందించింది. 

ALSO READ: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్‌ స్వాప్‌ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు!

నటి మాధవీలత తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో రేవంత్ రెడ్డికి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించింది. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదని.. ఆయనకి తెలియకుండా జరిగిందని తెలిపింది. అయితే ఆ ఘటన మీద సరిగా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు అని చెప్పింది. తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉందని పేర్కొంది. 

అసదుద్దీన్ ఓవైసీను నిలదీస్తారా?

ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

అలా అనుకుంటే రీసెంట్‌గా మెదక్ జిల్లాలో ఒక చిన్న పాపను రేప్ చేశారు కదా.. మరి దాని గురించి మాట్లాడి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ లను నిలదీస్తారా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల వల్లే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నా అని లెటర్ రాసి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు 
రూ.25 లక్షలు ఇచ్చారా? పోనీ రూ.25వేలు అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. 

ఇండస్ట్రీ మీద ఉక్కు పాదం

అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై విరుచుకు పడింది. పొద్దు తిరుగుడు పువ్వు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రైతు కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సాయం చేశారా? అని ప్రశ్నించారు. జరిగిన తప్పుకి ఇండస్ట్రీ మీద ఉక్కు పాదం మోపాలి, వాళ్ళని కాళ్ళ కింద పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు అని అన్నారు. 

గలీజుగా బిహేవ్ చేస్తున్నారు

జగన్ సీఎం అయ్యాక సినిమా వాళ్లందరినీ పిలిపించుకొని ఫోజులు కొట్టి దండం పెట్టించుకున్నట్లు మనం సీఎం అయ్యాక ఎందుకు చేయించుకోకూడదు అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి పైకొచ్చి ఈ స్థాయికి వచ్చాక ఎందుకు ఇంత గలీజుగా బిహేవ్ చేస్తున్నారు అని ప్రశ్నించారు. 

ALSO READ: సైబర్ కేటుగాళ్ల కొత్త స్కామ్.. సిమ్‌ స్వాప్‌ చేసి రూ.7 కోట్లు కొట్టేశారు!

గురుకుల పాఠశాలల్లో ఎంతోమంది చనిపోతే ఏనాడైనా మాట్లాడిన పాపాన పోలేదన్నారు. అందరికీ ఒకేలాగా స్పందించండని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దిల్ రాజును అడ్డం పెట్టుకొని పెత్తనం చెలయించాలని చూస్తున్నారు అని తెలిపారు. ఏం చేస్తారు సినిమా బతుకులు, అంతా వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు