Ustaad Bhagat Singh: పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అదిరే అప్డేట్!

పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబోలో రాబోతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ త్వరలో షూటింగ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే నెల నుంచి షూటింగ్‌ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

New Update

 Ustaad Bhagat Singh: డైరెక్టర్ హరీష్ శంకర్ పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు  పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఎక్స్ వేదికగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

ఇది రీమేక్ కాదు 

వచ్చే నెల నుంచి షూటింగ్‌ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమా కథను పవన్ కోసం ప్రత్యేకంగా రూపొందించారట. పవన్ ఫ్యాన్స్ ని అలరించేలా మాస్ అంశాలు, విసిల్‌మార్క్ సన్నివేశాలతో స్క్రిప్ట్‌ను డిజైన్ చేశారని సమాచారం. కథ, పాత్రలు అన్ని కొత్తగా ఉంటాయని చిత్రబృందం తెలిపింది. పవన్ ఇందులో ఇప్పటివరకు చేయని  క్యారెక్టర్ చేయనున్నారని తెలుస్తోంది.

Also Read: Cannes 2025: ఈ మిస్టరీ బుక్ లో ఏముంది?.. కేన్స్ లో మెగాస్టార్ 'విశ్వంభర' బుక్ విడుదల

శ్రీలీల కథానాయికగా

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, సంగీతాన్ని దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫాన్స్‌కు ఫుల్  ప్యాకేజ్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వాలని చిత్రబృందం భావిస్తోంది. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుండటంతో అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

latest-news | cinema-news | ustad-bhagat-singh | Pawan Kalyan | Harish Shankar 

Also Read: #AA22xA6: వామ్మో.! ఒక్క హీరో కోసం ముగ్గురు స్టార్ హీరోయిన్లు.. అట్లీ ప్రాజెక్ట్ పై పెరుగుతున్న అంచనాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు