#AA22xA6: అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాపై పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ మరింత క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇప్పటికే ఈమూవీలో అల్లు అర్జున్ జోడీగా మృణాల్, జాన్వీ ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగా జరుగుతోంది. కాగా, ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.
Woah! Now that’s a power-packed combo🔥🔥#AlluArjun, #DeepikaPadukone, and #Atlee coming together is MASSIVE.
— Cineholic (@Cineholic_india) May 22, 2025
Deepika backing out of Spirit for this says a lot about the scale of #AA22xA6.
With #MrunalThakur and #janhvikapoor also onboard, this is shaping up to be an all-out… pic.twitter.com/pS6jf0GrzT
ముగ్గురు హీరోయిన్లు
తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా అల్లు అర్జున్- అట్లీ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారట. దీంతో ముగ్గురు హీరోయిన్లు బన్నీ జోడీగా మెరవనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్, దీపికా, అట్లీ పవర్ ఫుల్ కాంబో కలిసి రావడం ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు ఈ సినిమా కోసం దీపికా ప్రభాస్ 'స్పిరిట్' నుంచి తప్పుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్.
ఇదిలా ఉంటే ఇటీవలే ముంబై బాంద్రాలోని మోహబూబా స్థూడియోస్ లో అల్లు అర్జున్ లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫొటో షూట్ జరిగాయి. బన్నీ పాత్ర కోసం డైరెక్టర్ అట్లీ డిఫరెంట్ లుక్స్ అన్వేషించారట. రగ్గడ్ నుంచి స్టైలిష్ వరకు ఇలా చాలా ట్రై చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఓ భిన్నమైన ఇమేజ్ తో పరిచయం చేయాలని అనుకుంటున్నారట అట్లీ.
telugu-news | cinema-news | latest-news | Allu Arjun – Atlee Allu Arjun – Atlee
Also Read: Iswarya Menon: నడుము అందాలు చూపిస్తున్న ఐశ్వర్య.. హాట్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా!