మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వంభర' రీసెంట్ గా షూటింగ్ పూర్తిచేసుకొని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే 90% VFX పనులు పూర్తయినట్లు సమాచారం. సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ సినిమా VFX ను హాలీవుడ్ స్థూడియోలు సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నారు మేకర్స్.
'విశ్వంభర' బుక్
ఇప్పుడు ఇమేజ్ మరింత పెంచేందుకు.. అంతర్జాతీయ ఈవెంట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లారు నిర్మాత విక్రమ్ రెడ్డి. కేన్స్ వేదికపై 'విశ్వంభర' చిత్రానికి సంబంధించిన ఓ స్పెషల్ బుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత విక్రమ్ మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన మిథాలజికల్ కాన్సెప్ట్‌లు, గ్రాండియస్ విజువల్స్, ఫిల్మ్ స్కెల్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఈ బుక్ లో ఉన్నాయని వివరించారు.
Our Producer Vikram Reddy Unveils the Epic #VishwambharaBook at Cannes 🔥
— UV Creations (@UV_Creations) May 22, 2025
In a grand reveal, The international press witnessed a glimpse into the world of India’s Biggest Socio-Fantasy Adventure - #Vishwambhara.
MEGASTAR @KChiruTweets & team are bringing you a universe unlike… pic.twitter.com/XbdIT3rt4G
త్వరలోనే విడుదల
బింబిసారా ఫేమ్ వశిష్ఠ మల్లడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించగా.. ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్ , వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన “రామా రామా” సాంగ్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మిథాలజీ, సైన్స్ ఫిక్షన్, ఆధ్యాత్మికత కలయికతో ప్రేక్షకులలో అంచనాలను పెంచుతోంది ఈ చిత్రం.
telugu-news | latest-news | cinema-news | chirnjeevi-vishwambhara | vishwambhara-movie
Also Read: RGV: మరో వివాదంలో RGV.. కియారా బికినీ లుక్ పై వల్గర్ పోస్ట్! తిట్టిపోస్తున్న నెటిజన్లు