/rtv/media/media_files/2025/10/09/telusu-kada-trailer-2025-10-09-11-42-57.jpg)
Telusu Kada Trailer
Telusu Kada Trailer: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ‘మిరాయ్’ తర్వాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు. టి.జి. విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
#TelusuKadaTrailer Announcement Today at 4:04 PM❤🔥#TelusuKada in cinemas worldwide from October 17th! pic.twitter.com/FHmWeYSiT3
— Tamil Movies (@KollywoodByte) October 9, 2025
Also Read: పవర్ స్టార్ 'ఓజీ' కలెక్షన్ల సునామీ.. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!
కూల్ స్టైలిష్ లుక్..
తాజాగా మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో ట్రైలర్ విడుదల తేదీని తెలిపే సమయాన్ని వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం 4:04 గంటలకు ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. పోస్టర్‌లో సిద్దు కూల్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై మంచి హైప్‌ను తీసుకొచ్చాడు.
Also Read: 'బాహుబలి' బడ్జెట్ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ
ఈ సినిమాతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. కెరీర్‌లో తొలిసారిగా మేగాఫోన్ పట్టిన ఆమెకి ఇది చాలా కీలకమైన సినిమా. సినిమాకి సంగీతం ఎస్ ఎస్ తమన్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్‌లో సిద్దు చెప్పిన “70% ఏంజెల్... 30% డెవిల్” అనే డైలాగ్‌కు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ ట్రైలర్ సిద్ధూ గత హిట్ మూవీ డీజే టిల్లు గుర్తు చేస్తుంది.
Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..
సిద్దు ఇటీవల కృష్ణ అండ్ హీజ్ లీలా, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వంటి సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ‘డీజే టిల్లు’ సక్సెస్ తర్వాత అతని క్రేజ్ పెరిగింది. ఇప్పుడు 'తెలుసు కదా' కూడా అలాంటి హిట్ లైన్‌లోనే వస్తోంది. సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో సిద్దు రొమాన్స్, డైలాగ్స్, యాక్టింగ్ అన్నీ యూత్ ని ఆకట్టుకునేలా ఉన్నాయి.
Also Read: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!
ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇది దీపావళి సందర్భంగా ప్రేక్షకులకు ఓ ప్రత్యేకమైన ఫెస్టివ్ ట్రీట్ కానుంది. మొత్తానికి ‘తెలుసు కదా’ ట్రైలర్ రిలీజ్ డేట్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సాయంత్రం 4:04కి ట్రైలర్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది.