Mass Jathara: సోషల్ మీడియా నెగెటివిటీపై రవి తేజ వైరల్ కామెంట్స్!

రవి తేజ శ్రీ లీలా కాంబోలో వస్తున్న "మాస్ జాతర" సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవి తేజ సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ట్విట్టర్‌లో నెగెటివిటీ ఎక్కువని, అందుకే దూరంగా ఉంటానన్నారు.

New Update
Mass Jathara

Mass Jathara

Mass Jathara: మాస్ మహారాజా రవి తేజ(Ravi Teja) నటిస్తున్న కొత్త సినిమా ‘మాస్ జాతర’ త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాని భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం రవి తేజ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన సోషల్ మీడియా గురించి ఆసక్తికరంగా స్పందించారు.

రవి తేజ మాట్లాడుతూ.. 

“ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుంటాను. చాలా క్రియేటివ్‌గా ఉంటాయి. కానీ ట్విట్టర్‌లో మాత్రం చాలామంది నెగెటివ్‌గానే కామెంట్స్ పెడతారు. నెగెటివిటీ ఎక్కువ. అందుకే నేను దూరంగా ఉంటాను. కామెంట్స్ చదవను. వాటితో నాకు పెద్దగా సంబంధం ఉండదు” అని చెప్పారు.

సినిమా డిటైల్స్..

‘మాస్ జాతర’లో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 31, 2025న థియేటర్లలో విడుదల అవుతోంది. మొదట ఈ సినిమాను ఆగస్టులోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఆలస్యం, ఫెడరేషన్‌ స్ట్రైక్ వంటివి కారణంగా పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడు కొత్త డేట్ ఫిక్స్ అయింది.

ఈ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్ (నాగ వంశీ), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ (సాయి సౌజన్య) కలిసి నిర్మిస్తున్నారు. ప్రెజెంటేషన్ శ్రికర స్టూడియోస్ ద్వారా జరుగుతోంది. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు.

మాస్ అవతార్ లో రవి తేజ..

ఈ మూవీలో రవి తేజ పవర్‌ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నాడు. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ కలిపిన సినిమా కావడంతో ఫ్యాన్స్‌కి మంచి మాస్ ఫెస్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, పాటలు రిలీజ్ అయితే మరింత హైప్ పెరగనుంది.

ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే, రవి తేజ కంటే చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇప్పుడు ట్విట్టర్‌ను దూరంగా పెట్టేస్తున్నారు. నెగెటివిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ట్రెండ్ ఎక్కువవుతోంది.

‘మాస్ జాతర’ సినిమాతో రవి తేజ మళ్ళీ మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే ప్లాన్‌లో ఉన్నారు. ఆయన చెప్పినట్టు ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు మంచి ఎనర్జీ ఉన్న సినిమా అవుతుందని తెలుస్తోంది. ఇక సినిమాకి ఇంకొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న నేపధ్యంలో, ప్రమోషన్స్‌కి స్పీడ్ పెంచారు మూవీ టీమ్.

Advertisment
తాజా కథనాలు