Ramayana: వామ్మో అంత డబ్బులా..రామాయణానికి బడ్జెట్ రూ.4 వేల కోట్లు

ఒక సినిమాను ఇంత భారీ బడ్జెట్ తో ఎప్పుడూ తీసి ఉండరేమో. ఇప్పటికే కాస్టింగ్ తో వైరల్ అవుతున్న బాలీవుడ్ రామాయణం సినిమా ఇప్పుడు మరో సారి వార్తల్లో నిలిచింది. ఈ మూవీ బడ్జెట్ రూ. 4 వేల కోట్లు అని నిర్మాత నమిత్ మల్హోత్రా చెప్పారు. 

New Update
ramayana

Ramayana Movie

భారతీయ సినిమా చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు వెయ్యి కోట్లతో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు వీటన్నింటినీ దాటుకుని నితీశ్ తివారీ తీస్తున్న రామాయణం రికార్డ్ క్రియెట్ చేయనుంది.  సినిమాకు ఏకంగా 4 వేల కోట్ల రూపాయలను పెడుతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత నమిత్‌ మల్హోత్రా స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఇంత భారీ బడ్జెట్ తో తెర కెక్కుతున్న మొదటి సినిమా ఇదే అనే టాక్ నడుస్తోంది.  

చరిత్ర సృష్టిస్తుంది..

బడ్జెట్ తో పాటూ నిర్మాత నమిత్ రామయణ గురించి మరెన్నో విషయాలు తెలిపారు.  తాము ఈ సినిమా గురించి నిధులు సమకూర్చుకుంటున్నామని..ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోవాలని అనుకోవడం లేదని చెప్పారు. రామాయణ కోసం ఏడు ఏళ్ళ కిందటే పనులు ప్రారంభించామని చెప్పారు. కోవిడ్ తర్వాత నుంచి పనులు మొదలుపెట్టానని...అందరూ తనను పిచ్చివాడనుకున్నారని నమిత్ చెప్పుకొచ్చారు. ఈ ఇతిహాసం రెండు భాగాలు రానుందని చెప్పారు.  ఏ భారతీయ సినిమా కూడా ‘రామాయణ’ దరిదాపుల్లోకి రాలేదని స్పష్టం చేశారు. దీంతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని చెప్పారు. 

రామాయణ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ నటిస్తున్నారు. కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మొదటి పార్ట్‌ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానున్నాయి. 

Also Read: Mumbai Blasts: సంజయ్ దత్ చెప్పి ఉంటే ముంబై పేలుళ్ళు జరిగేవి కావు..ఉజ్వల్ నికమ్

Advertisment
Advertisment
తాజా కథనాలు