Mumbai Blasts: సంజయ్ దత్ చెప్పి ఉంటే ముంబై పేలుళ్ళు జరిగేవి కావు..ఉజ్వల్ నికమ్

ముప్పైళ్ళ క్రితం 1993లో జరిగిన ముంబై పేలుళ్ళ కేసు వాదించిన ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు సంజయ్ దత్ చెప్పి ఉంటే ముంబై పేలుళ్లు ఆగేవి అన్నారు. 

New Update
mumbai blasts

Ujwal Nikam, mumbai blasts key lawyer

ఉజ్వల్ నికమ్...ఈయన భారత్ లో ఓ ప్రముఖ న్యాయవాది. ఎన్నో ఏళ్ళుగా లాయర్ వృత్తిలో ఉన్న ఉజ్వల్ ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ మధ్యనే రాజ్యసభకు ఎంపికయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిఫార్సు ఉజ్వల్ ను సిఫార్స్ చేశారు. ఈయన న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు ఎన్నో ముఖ్యమైన కేసులను వాదించారు. ముంబై హైకోర్టులో పని చేసిన ఉజ్వల్ ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన ముంబై పేలుళ్ల కేసును కూడా వాదించారు. అలాగే పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ఉరితీసిన 26/11 ముంబై దాడికి కూడా నికమ్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు.

ఆ ఒక్క తప్పు చేసి ఉండకపోతే..

తాజాగా ఉజ్వల్ నికమ్ ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ముంబై పేలుళ్లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పేలుళ్ల కోసం సరఫరా చేసిన ఆయుధాల వ్యాన్ గురించి నటుడు సంజయ్ దత్ కు ముందే తెలుసునని..ఆయన దాని గురించి వెంటనే చెప్పి ఉంటే 267 మంది ప్రాణాలు కాపాడి ఉండేవారని అన్నారు. ఆ వాహనంలో వచ్చిన ఏకే 47ను సంజయ్ దత్ తన దగ్గర ఉంచుకున్నారని కూడా తెలిపారు. అప్పట్లో అతను ఆయుధాల పట్ల ఆకర్షితుడు అయ్యాడని ఉజ్వల్ తెలిపారు. చట్టం దృష్టిలో అతను నేరం చేశాడు. కానీ అతను ముక్కుసూటి వ్యక్తి... నేను అతన్ని నిర్దోషిగా భావించానన్నారు. 

1993 మార్చి 12న పేలుడు జరిగింది. దానికి కొన్ని రోజుల ముందు ఒక వ్యాన్ సంజయ్ దత్ ఇంటికి వచ్చింది. అది ఆయుధాలతో నిండి ఉంది - హ్యాండ్ గ్రెనేడ్లు, AK 47లు. అబూ సలేం (గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు) వాటిని తెచ్చాడు. సంజయ్ కొన్ని హ్యాండ్ గ్రెనేడ్లు, తుపాకులను తీసుకున్నాడు. తరువాత అతను అవన్నీ తిరిగి ఇచ్చి ఒకే ఒక AK 47 ను తన వద్ద ఉంచుకున్నాడు. ఆ సమయంలో అతను పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే, పోలీసులు దర్యాప్తు చేసి ఉండేవారు. ముంబై పేలుళ్లు ఎప్పటికీ జరిగేవి కావు అని నికమ్ అన్నారు. 

ఇక ఈ కేసులో సంజయ్ దత్ ను ఉగ్రవాద, విధ్వంసక కార్యకలాపాల నివారణ చట్టం..టాడా కింద ఉగ్రవాది అనే అభియోగం నుండి కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కానీ ఆయుధ చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించింది. తరువాత, సుప్రీంకోర్టు సంజయ్ దత్ కు ఆరు సంవత్సరాల శిక్షను ఐదు సంవత్సరాలకు తగ్గించింది. ఈ శిక్షను అతను పూణేలోని యెర్వాడ జైలులో  పూర్తి చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు