Syria: సిరియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. అంతర్యుద్ధానికి కారణం ఏంటి ?

సిరియాలో మొదలైన అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల అసద్‌ మద్దతుదారులు, సిరియన్ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో రెండ్రోజుల్లోనే దాదాపు1000 మందికి పైగా మృతి చెందారు. అంతర్యుద్ధం ఎలా మొదలైందో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Syria Civil War

Syria Civil War

సిరియాలో 2011లో మొదలైన అంతర్యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల అసద్‌ మద్దతుదారులు, సిరియన్ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో రెండ్రోజుల్లోనే దాదాపు1000 మందికి పైగా మృతి చెందారు. సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత ఇదే అత్యంత ఘోరమైన హింసాత్మక ఘటనగా చెబుతున్నారు. మృతుల్లో 745 మంది సాధారణ పౌరులే ఉన్నారు. మరో 125 మంది భద్రతా సిబ్బంది, 148 మంది అసద్‌ మద్దతుదారులు మృతి చెందారు.  ఇంతకీ అసలు ఈ సంక్షోభం ఎలా మొదలైందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 

అంతర్యుద్ధానికి కారణం

2011కు ముందు సిరియా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండేది. ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ హయాంలో నిరుద్యోగం, అవినీతి, అక్రమంగా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అక్కడ సాగుతున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సిరియాలో ఆందోళనలు జరగడం ప్రారంభమయ్యాయి. మొదటిసారిగా 2011 మార్చిలో సిరియాలోని డీరా అనే నగరంలో ఆందోళనలు చెలరేగాయి. దీన్ని ప్రభుత్వం కఠినంగా అణిచివేస్తూ వచ్చింది. దీంతో బషర్‌ అల్ అసద్ గద్దె నుంచి దిగిపోవాలంటూ పెద్దఎత్తున ఆందోళనలు మొదలయ్యాయి.  

Also Read: పన్నులు తగ్గించాలని అడగొద్దు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

పుట్టుకొచ్చిన తిరుగుబాటు ముఠాలు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీ కార్యకర్తలు, మద్ధతుదారులు తుపాకులు చేత పట్టారు. ఆ తర్వాత సైన్యం మీద కూడా దాడులు చేయడం  ప్రారంభించారు. చివరికి ఈ హింసాత్మక ఘటనలే అంతర్యుద్ధానికి (సివిల్‌ వార్‌) దారి తీశాయి. వందలాది ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటు ముఠాలు పుట్టుకొచ్చాయి. ఇది సిరియా అధ్యక్షుడు బషల్ అల్‌ అసద్, ఆ దేశ ప్రజల మధ్య యుద్ధంలా మారిపోయింది. అంతేకాదు విదేశీ శక్తులు కూడా ఇరు వర్గాలకు వివిధ రూపాల్లో సాయం చేయడం మొదలుపెట్టాయి.

డబ్బు, ఆయుధాలు, సైనికులను అందించాయి. ఈ ఆందోళనల్లోకి అతివాద ఇస్లామిక్‌ గ్రూప్స్‌ అయిన అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్‌ లాంటి ఉగ్ర సంస్థలు కూడా చేరడంతో పరిస్థితులు అదుపులేకుండా పోయాయి. సిరియాలో అల్‌ అసద్‌ పాలన నుంచి విముక్తి కోసం, స్వయం పరిపాలన కోసం డిమాండ్‌ చేస్తూ కుర్దులు కూడా ఈ పోరాటంలో చేరిపోయారు. రష్యా, ఇరాన్ దేశాలు సిరియా ప్రభుత్వానికి మద్ధతిచ్చాయి. ఇక టర్కీ, మరికొన్ని పశ్చిమ దేశాలు, గల్ఫ్‌ దేశాలు తిరుగుబాటుదారులకు సహకరించాయి. ఇలా సిరియాలో అంతర్యుద్ధం గత 14 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ఇప్పటిదాకా లక్షలాది మంది ఈ హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.  

ALso Read: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు..పైలట్లు ఏం చేశారంటే

అయితే తిరుగుబాటుదారులు ఇటీవల సిరియాను ఆక్రమించారు. దీనివల్ల అసద్‌ తన కుటుంబంతో రష్యాకు పారిపోయారు. ఆ తర్వాత తిరుగుబాటుదారులు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ అసద్‌ సపోర్టర్స్‌ జబ్లే నగరంలో భద్రతా దళాలపై దాడులు జరిపి చంపేశారు. దీంతో అసద్‌ మద్దతుదారులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించిన ప్రభుత్వ దళాలు పెద్దఎత్తున ప్రతీకార దాడులకు దిగారు. ఈ దాడుల్లో పలు ఇళ్లకు నిప్పంటించారు. బనియాస్‌ సిటీలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల మృతదేహాలను వీధుల్లో, అలాగే ఇళ్లల్లో కూడా పడి ఉన్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు. ఈ హింసాత్మక ఘటనల్లో రెండ్రోజుల్లోనే దాదాపు 1000 వెయ్యిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు