/rtv/media/media_files/2025/02/24/N4OTkNAjUlR3lQMiY44H.jpg)
natural star nani birthday special story and nani life journey
డైరెక్టర్ అవుదామని వచ్చి యాక్టర్ అయ్యాడు. అక్కడ నుంచి నేచురల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు బాక్సాఫీసు బద్దలు కొడుతున్నాడు. సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోలు అనగానే ముందుగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత రవితేజ కనిపిస్తాడు. ఇప్పుడు జనరేషన్‌లో అయితే నాని పేరు వినిపిస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడకే వస్తున్నా. ఇవాళ నేచురల్ స్టార్ నాని బర్త్ డే. నేటితో అతడు 41ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేచురల్ స్టార్ నానిగా అతడి జర్నీ గురించి తెలుసుకుందాం.
హైదరబాద్‌లో జననం
1984 ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో ఘంటా నవీన్ బాబుగా నాని జన్మించాడు. ఎడ్యుకేషన్ మొత్తం హైదరాబాద్‌లోనే జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్‌గా ఉన్న రోజుల్లో నానికి సినిమా పిచ్చి పట్టుకుంది. దీంతో డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయిపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఛాన్స్ కోసం చాలా కష్టపడ్డాడు. ఎన్నో స్టూడియోల చుట్టూ తిరిగాడు.
తొలి అవకాశం
ఈ క్రమంలోనే లెజెండరీ దర్శకుడు బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరేందుకు నాని పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో నెలలు కడుపు మాడ్చుకుని మరీ అవకాశాల కోసం ఎదురుచూశాడు. చివరికి బాపు దర్శకత్వం వహించిన రాధాగోపాళం సినిమాకు క్లాప్ కొట్టి అసిస్టెంట్ దర్శకుడిగా ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత అల్లరి బుల్లోడు, అస్త్రం వంటి పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు.
ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత
RJగా
ఆ తర్వాత తానే స్క్రీన్ ప్లే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా బ్రేక్ ఇచ్చాడు. అయితే డబ్బుల లేక మరోవైపు ఆర్జేగా చేశాడు. ఇలా చేస్తున్న సమయంలో దర్శకురాలు నందిని రెడ్డి సహాయంతో ఇంద్రగంటి అష్టాచమ్మా సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. దీంతో నానిలో ఫుల్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది.
ఆ తర్వాత వెంటనే రైడ్ సినిమా చేశాడు. అనంతరం స్నేహితుడా సినిమా చేశాడు. కానీ ఇవి బెడిసికొట్టాయి. ఆ తర్వాత భీమిలీ కబడ్డి జట్టు సినిమాలో నాని యాక్టింగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆపై అలా మొదలైంది సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. అలా పిల్ల జమిందార్ సినిమా కూడా చేసి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక అతడి కెరియర్‌ను మార్చేసింది మాత్రం ‘ఈగ’ సినిమానే అని చెప్పాలి. అలా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీ అయిపోయాడు. ఆ సమయంలోనే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు.
Also Read: Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..
ఆ తర్వాత వరుసపెట్టి 8 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ముఖ్యంగా అతడికి ‘నేచురల్ స్టార్’ అనే ట్యాగ్ భలేభలే మగాడివోయి అనే సినిమాతో వచ్చింది. దీంతో అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేవు. వరుస పెట్టి సినిమాలో ఓ వైపు హిట్లు కొడుతూనే మరోవైపు పాపులర్ షో అయిన బిగ్ బాస్ హోస్టింగ్‌తో హోరెత్తించారు. దీంతో అతడి పేరు మరింత పెరిగిపోయింది.
నిర్మాతగా
రాజ్ నిడిమోరు, కృష్ణ డికె కలిసి నిర్మించిన డి ఫర్ దోపిడి (2013) తో నాని నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. తరువాత ఆయన తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాను ప్రారంభించారు. బ్యానర్ కింద మొదటి చిత్రం, ఆవే! 2018లో విడుదలైంది, రెండు జాతీయ అవార్డులను కూడా గెలుచుకుంది.
Also Read: IND vs PAK Champions Trophy 2025 LIVE Updates: పాక్‌పై భారత్ ఘనవిజయం
అప్పటి నుండి ఆయన HIT: ది ఫస్ట్ కేస్, మీట్ క్యూట్, HIT: ది సెకండ్ కేస్, HIT: ది థర్డ్ కేస్ వంటి అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మించారు. రొమాంటిక్ డ్రామాల నుండి ఇంటెన్స్ థ్రిల్లర్‌ల వరకు నాని తన వైవిధ్యమైన చిత్రాల సెలక్షన్లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఇలా అతడి లైఫ జర్నీ సాగింది. అందువల్లనే తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న దర్శకులకు అతడు అవకాశాలు ఇస్తూనే హిట్లు అందుకుంటున్నాడు.