/rtv/media/media_files/2025/09/03/param-sundari-2025-09-03-11-55-38.jpg)
Param Sundari
సిద్ధార్థ్ మల్హోత్రా(Sidharth Malhotra), జాన్వీ కపూర్(Janhvi Kapoor) కలిసి నటించిన 'పరం సుందరి'(Param Sundari) సినిమా తాజాగా థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ మూవీలో సైడ్ క్యారెక్టర్‌లో నేషనల్ క్రష్ ప్రియా ప్రకాష్ వారియర్ కనిపించడంతో ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. నేషనల్ క్రష్, హీరోయిన్‌గా సినిమాల్లో నటించిన ఈమె ఇప్పుడు బాలీవుడ్‌లో సైడ్ క్యారెక్టర్‌గా ఎందుకు నటించిందని ఫ్యాన్స్ ఆశ్చర్యపడుతున్నారు. హీరోయిన్‌గా జాన్వీ ప్లేస్‌లో నటించాల్సిన ప్రియా ఎందుకు సైడ్ క్యారెక్టర్‌లో నటించిందని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ మూవీలో ఆమె పాత్రకు ఎలాంటి స్కోప్ కూడా లేదు. కనీసం ఒక్క డైలాగ్ కూడా లేదు. ఇలాంటి పాత్ర చేయడానికి అసలు ప్రియా ఎలా ఒప్పుకుందని ఫ్యాన్స్ సందేహంలో పడిపోయారు. ఈ మూవీలో ఆమె రెడ్ అండ్ వైట్ శారీ ధరించి సిగ్గుపడుతూ కనిపిస్తోంది. కనీసం ఒక్క డైలాగ్ కూడా ఈమె పాత్రకు లేకుండా ఎందుకు ఒకే చెప్పిందని ఫ్యాన్స్ ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash Varrier) పై మండిపడుతున్నారు. వీటికి సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చూడండి: Gama Awards 2025: గామా అవార్డ్స్‌లో ‘పుష్ప’ సంచలనం.. ఒకటి కాదు రెండు కాదు - అవార్డులే అవార్డులు..
ఓవర్ నైట్ స్టార్‌గా మారి..
ప్రియా ప్రకాష్ వారియర్ 2019లో మలయాళ చిత్రం 'ఒరు అదార్ లవ్'తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కన్ను గీటే సీన్‌తో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఎందరో కుర్రాళ్లకు క్రష్‌గా మారిపోయింది. ఇప్పటికీ ప్రియా కొందరికి క్రష్‌గా ఉంది. అలాంటి హీరోయిన్‌గా సడెన్‌గా ఎలాంటి స్కోప్ లేని ఒక సైడ్ క్యారెక్టర్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అసలు మూవీలో ఈమెను ఎందుకు ఇంత వరకు గుర్తించలేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఈమె పాత్రకు స్కోప్ ఉండవచ్చు. కాకపోతే ఎడిటింగ్‌లో ఆమెను కట్ చేసి ఉండవచ్చని అంటున్నారు. ఏదేమైనా దీనిపై ప్రియా ప్రకాష్ వారియర్ ఒకసారి స్పందిస్తేనే విషయం తెలుస్తుంది.
𝐏𝐫𝐢𝐲𝐚 𝐕𝐚𝐫𝐫𝐢𝐞𝐫 𝐚𝐩𝐩𝐞𝐚𝐫𝐬 𝐚𝐬 𝐞𝐱𝐭𝐫𝐚 𝐢𝐧 𝐏𝐚𝐫𝐚𝐦 𝐒𝐮𝐧𝐝𝐚𝐫𝐢 𝐚𝐦𝐢𝐝 𝐌𝐚𝐥𝐚𝐲𝐚𝐥𝐢 𝐫𝐞𝐩𝐫𝐞𝐬𝐞𝐧𝐭𝐚𝐭𝐢𝐨𝐧 𝐫𝐨𝐰
— IndiaToday (@IndiaToday) September 3, 2025
Priya Prakash Varrier, who gained fame for her viral wink in the 2019 Malayalam film 'Oru Adaar Love', appeared as a background… pic.twitter.com/n1eztKBY4K
ఇది కూడా చూడండి: CINEMA: ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అప్డేట్.. ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్! సినిమా ఏంటో తెలుసా