/rtv/media/media_files/2025/09/02/prabhas-chiranjeevi-2025-09-02-14-41-09.jpg)
Prabhas- Chiranjeevi
CINEMA: హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులు, బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్'. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో ప్రభాస్ మునుపెన్నపుడు చేయని పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. కనీసం సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అయినా ఇవ్వండ్రా బాబు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కొందరు. ఈ క్రమంలో 'స్పిరిట్' సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ప్రభాస్ తండ్రిగా
తాజా అప్డేట్ ప్రకారం.. 'స్పిరిట్' లో ప్రభాస్- మెగాస్టార్ చిరంజీవి తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నారని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 'యానిమల్' సినిమాలో అనిల్ కపూర్ పాత్ర మాదిరిగానే.. 'స్పిరిట్' లో కూడా తండ్రి పాత్ర హైలైట్ గా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఏదేమైనా చిరంజీవి.. ప్రభాస్ తండ్రిగా నటిస్తున్నారనే వార్త ఫ్యాన్స్ లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే మెగాస్టార్, రెబల్ స్టార్ అభిమానులకు పండగనే చెప్పాలి.
#Exclusive ....🔥🔥#Chiranjeevi𓃵 to make a cameo in #Prabhas𓃵 starrer #Spirit , portraying his father...
— SouthMovie (@MovieSouth007) September 1, 2025
The makers are adding this track to bring an emotional touch to the film.. ✅ pic.twitter.com/gDFLA0Y6K5
'రాజాసాబ్', 'కల్కి పార్ట్ 2,', 'సలార్ పార్ట్ 2,', 'స్పిరిట్' ఇలా వరుస లైనప్స్ తో ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు సిద్ధమవుతున్నారు ప్రభాస్. ఇప్పటికే 'రాజాసాబ్' చిత్రీకరణ చివరి దశకు చేరుకోగా.. డిసెంబర్ 5న థియేటర్స్ లో సందడి చేయనుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'రాజాసాబ్' టీజర్ విడుదల సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది.
ఇందులో ప్రభాస్ పంచ్ డైలాగ్స్, కామెడీ, ఫన్ బుజ్జి గాడు, యోగి టైమ్స్ లోని వింటేజ్ ప్రభాస్ ని గుర్తుచేశాయి. ప్రభాస్ లుక్ కూడా చాలా స్టైలిష్ గా కనిపించింది. అయితే 'రాజాసాబ్' లో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమైంది. ఫన్, కామెడీ, లవర్ బాయ్ తరహాలో ఒక పాత్ర ఉండగా.. మరో పాత్ర భయపెట్టే విధంగా ఉండబోతుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహన్ ప్రభాస్ జోడీగా నటించారు. ఇక కల్కి పార్ట్ 2, సలార్ పార్ట్ 2 సినిమాలు కూడా సైమల్టేనియస్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. నాగశ్విన్ కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లతో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో పార్ట్ కోసం ఆసక్తిగా ఉన్నారు ఫ్యాన్స్.